అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు

ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.

Updated : 03 May 2024 05:54 IST

సామాన్యుడి సందేశం

ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు.. సైకిల్‌కు జాతీయ జెండా కట్టుకొని, తెల్ల దుస్తులు ధరించి.. గ్రామంలో సైకిల్‌యాత్ర చేపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు ప్రాధాన్యం వివరించే సందేశాల ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు కూలి పనులు చేసుకుంటూనే అయిదేళ్లుగా పౌరుల హక్కులు, బాధ్యతలపై సైకిల్‌పై చైతన్యయాత్ర చేస్తున్నట్లు అబ్రహం తెలిపారు. ‘ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓటేసినవారు ఆ తర్వాత తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతారు. అలాంటి చాలామందిని నా జీవితంలో చూశాను. అప్పటినుంచి నోటుకు ఓటు అమ్ముకోవద్దని, ఓటుకు దూరంగా ఉండొద్దనీ అవగాహన కల్పిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.

ఈనాడు, హనుమకొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని