‘జాగో తెలంగాణ’ ప్రచారంలో ఉద్రిక్తత

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో శుక్రవారం రాత్రి ‘జాగో తెలంగాణ’ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Published : 04 May 2024 05:14 IST

బోథ్‌, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో శుక్రవారం రాత్రి ‘జాగో తెలంగాణ’ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బోథ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ‘జాగో తెలంగాణ’ ఆధ్వర్యంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి అధ్యక్షతన బృంద సభ్యులు ఓటరు చైతన్య యాత్ర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని, హక్కులను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పార్టీలను ఓడించాలన్నారు. ప్రజలు భాజపాకు తప్ప వేరే ఏ పార్టీకైనా ఓటు వేయాలన్నారు. దీంతో అక్కడికి చేరుకున్న భాజపా, హిందూ సంఘాల నాయకులు వారిని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఓటరు చైతన్య యాత్ర పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాము వాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తున్నామని ‘జాగో తెలంగాణ’ సభ్యులు అన్నారు. పలువురు గ్రామస్థులు కలుగజేసుకొని ఇరు వర్గాలను సముదాయించి బోథ్‌ నుంచి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని