బోధన్‌, ముత్యంపేట నిజాం చక్కెర కర్మాగారాలకు మోక్షం!

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, జగిత్యాల జిల్లా ముత్యంపేటలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.

Published : 04 May 2024 05:15 IST

ఓటీఎస్‌ కింద రూ.43 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత
సెప్టెంబరు 17 నాటికి పునఃప్రారంభించేందుకు చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, జగిత్యాల జిల్లా ముత్యంపేటలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటికీ సంబంధించిన బకాయిలు రూ.43 కోట్లను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) కింద చెల్లించేందుకు నిర్ణయించింది. ప్రైవేటు యాజమాన్యాల కింద ఉన్న ఈ కర్మాగారాలను నష్టాల పేరుతో 2015లో మూసివేశారు. అప్పటి నుంచి తిరిగి తెరిపించాలని చెరకు రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే జనవరి 12న మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర్‌ రాజ నర్సింహ ఛైర్మన్‌, సహ ఛైర్మన్‌గా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. వీరు బోధన్‌, ముత్యంపేట కర్మాగారాల పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందులపై బ్యాంకర్లతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఓటీఎస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. తాజాగా బ్యాంకర్లు రూ.43 కోట్లకు సమ్మతించటంతో ప్రభుత్వం నిధుల విడుదలకు సిద్ధమైనట్లు సమాచారం. సెప్టెంబరు 17లోపు చక్కెర పరిశ్రమలను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా చర్యలు కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని