రాష్ట్రంలో బాలింతల మరణాలను నివారించాలి

అత్యాధునిక వైద్య వసతులను ఉపయోగించుకుని రాష్ట్రంలో బాలింతల మరణాలను పూర్తిగా నివారించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ పేర్కొన్నారు.

Published : 04 May 2024 05:17 IST

వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి

ఈనాడు, హైదరాబాద్‌: అత్యాధునిక వైద్య వసతులను ఉపయోగించుకుని రాష్ట్రంలో బాలింతల మరణాలను పూర్తిగా నివారించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ పేర్కొన్నారు. సురక్ష మాతృత్వ ఆశ్వాసన్‌(సుమన్‌) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..మాతా, శిశు సంరక్షణలో మెరుగైన వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ యునిసెఫ్‌ చీఫ్‌ జెలీం తఫ్పీసీతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల గైనకాలజిస్ట్‌లు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని