రూ.12 కోట్ల ఎగవేత.. రైస్‌ మిల్లు సీజ్‌

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను అప్పగించకుండా నాలుగేళ్లుగా జాప్యం చేస్తున్న రైస్‌ మిల్లును అధికారులు సీజ్‌ చేశారు.

Published : 04 May 2024 05:17 IST

ములుగు, న్యూస్‌టుడే: కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను అప్పగించకుండా నాలుగేళ్లుగా జాప్యం చేస్తున్న రైస్‌ మిల్లును అధికారులు సీజ్‌ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని సాయి సహస్ర రైస్‌ టెక్‌ మిల్లు 2019-20 సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.12 కోట్ల విలువైన 26వేల క్వింటాళ్ల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాల్సి ఉంది. ఎన్ని నోటీసులు పంపినా మిల్లు యజమాని జనగాం మహేందర్‌ స్పందించకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిల్లులో ఉన్న నిల్వలను తనిఖీ చేశారు. మిల్లులో సుమారు రూ.6 కోట్ల ధాన్యం నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ధాన్యాన్ని ఎక్కడికి తరలించకుండా మిల్లును సీజ్‌ చేసినట్లు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ రాంపతి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. తనిఖీల్లో ములుగు తహసీల్దారు విజయభాస్కర్‌, డీటీ రాంచందర్‌, ఎస్సై వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని