రైతుభరోసాపై త్వరలో విధివిధానాలు

రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Published : 08 May 2024 04:02 IST

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మంగపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నగదును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. గత ప్రభుత్వంలో బంజరు భూములకు, విదేశాల్లో ఉన్నవారికి రూ.లక్షల నగదు జమ చేయడం జరిగిందన్నారు. మంగళవారం ములుగు జిల్లాలోని మంగపేట, ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. మంగపేటలో విలేకరులతో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నిజమైన రైతులకు, పంట పండే వ్యవసాయ భూములకు మాత్రమే రైతుభరోసా ఇచ్చేలా విధివిధానాలు రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌  మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు, వ్యవసాయ ఉపకరణాలను మంజూరు చేయాలని జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ డైరెక్టర్‌ నాసిరెడ్డి సాంబశివరెడ్డి మంత్రిని కోరారు. మిర్చి రైతుల కోసం ఉద్యానశాఖ ద్వారా ప్రత్యేక పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి.. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు పలు పథకాలను అమలు చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని