నిజాయతీగానే ‘సారీ’ చెబుతున్నారా?
జీవితం మనకు ఎన్నో బంధాలను అందిస్తుంది.. కానీ వాటిని కాపాడుకునే బాధ్యతను మాత్రం మన చేతుల్లోనే పెడుతుంది.. ఎందుకో తెలుసా?? ఆ బంధాలనేవి అద్దాల్లాంటివి. ఒక్కసారి పగిలితే తిరిగి అతుక్కోవు. అందుకే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగని ఎంత సొంతవారైనా అభిప్రాయభేదాలు సహజం.
జీవితం మనకు ఎన్నో బంధాలను అందిస్తుంది.. కానీ వాటిని కాపాడుకునే బాధ్యతను మాత్రం మన చేతుల్లోనే పెడుతుంది.. ఎందుకో తెలుసా?? ఆ బంధాలనేవి అద్దాల్లాంటివి. ఒక్కసారి పగిలితే తిరిగి అతుక్కోవు. అందుకే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగని ఎంత సొంతవారైనా అభిప్రాయభేదాలు సహజం. అలాంటి సందర్భాల్లో తెలిసో, తెలియకో మన వల్ల ఇతరులు, ఇతరుల వల్ల మనం 'హర్ట్' అయ్యే అవకాశాలు చాలానే ఉంటాయి.. అలాగని ఒకసారి 'హర్ట్' అయ్యాం అని ఆ బంధాన్నే తెంచేసుకోలేం కదా.. ఇలాంటప్పుడే పశ్చాత్తాపంతో నిజాయతీగా క్షమాపణ అడగగలిగితే అటు బంధం వీగిపోకుండా ఉంటుంది.. ఇటు మనసులోని భారమూ దిగినట్లవుతుంది.
కోపతాపాలకు సెలవు!
ఎదుటివాళ్లు చేసిన పనులు, మాటల వల్ల మనకు కోపం రావడం సహజం. అయితే కోపాన్ని అదుపు చేసుకోగలగడమే మన గొప్పతనం. అలాగని లోపల విపరీతమైన కోపం ఉన్నా.. బయటకు వారిని క్షమించేసి, లోలోపల ఉడికిపోవడం సరికాదు. కాబట్టి ఎదుటివారిని మనస్ఫూర్తిగా క్షమించగలిగే క్షమాగుణాన్ని అలవర్చుకోగలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
క్షమాపణ.. ఇలా!
అయితే 'క్షమించమని అడగడం' మన చేతుల్లోనే ఉంది కాబట్టి, ఎంత పెద్ద పొరపాట్త్లెనా చేసేయొచ్చు. తర్వాత సింపుల్‌గా 'సారీ' అంటే సరిపోతుందనుకుంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది. క్షమించమని అడగడమంటే జస్ట్ సారీ చెప్పి వెళ్లిపోవడం కాదు.. క్షమాపణ కోరడంలోనూ వివిధ దశలుంటాయి. మనం చేసే తప్పు తీవ్రతపై అవి ఆధారపడి ఉంటాయి.
⚛ ముందుగా- చేసిన పొరపాటుకు మనం ఫీలవుతున్నామన్న భావన ఎదుటివారికి తెలిసేలా సారీ చెప్పాలి.
⚛ రెండో దశలో.. జరిగిన పొరపాటుకు మనదే బాధ్యత అని తెలియజేయడం ముఖ్యం. ఇంకోసారి ఈ పొరపాటు జరగనివ్వమనే హామీ మన మాటల ద్వారా వారికి అర్థం కావాలి.
⚛ మూడో దశలో.. మనం చేసిన పొరపాటు ఏ పరిస్థితుల్లో జరిగిందో వారికి వివరించే ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో జరిగిన దాంట్లో మన తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేయకూడదు. మన తప్పును ఒప్పుకుంటూనే దానికి దారితీసిన కారణాలను వివరించాలి.
⚛ ఇవి మూడూ చేసిన తర్వాత వారిని క్షమాపణ అడగగలిగితే వారు తప్పక క్షమిస్తారు.
⚛ ఆ తర్వాత దశలో మనం చేసిన తప్పును ఒప్పుకుంటున్నామన్న భావనను వీలైతే స్పర్శ ద్వారా తెలియజేయాలి. చేతులు పట్టుకోవడం, మరీ దగ్గరివారైతే కౌగిలించుకోవడం ద్వారా మన మనసులోని భావాలను వ్యక్తం చేయచ్చు.
క్షమించే గుణమూ ఉండాలి!
పొరపాటు చేసినప్పుడు ఎదుటివారిని క్షమాపణ అడగడమే కాదు.. ఎదుటివారు క్షమాపణ చెప్పినప్పుడు వారిని మన్నించగలిగే మనస్తత్వమూ ఉండాలి. వాళ్ల తప్పులను క్షమించడం వాళ్లకెంత అవసరమో మనకూ అంతే అవసరం. లేకపోతే దానికి సంబంధించిన ఆలోచనలు మన మనసులో ఉండిపోతాయి. తీవ్రంగా బాధిస్తాయి... అవతలివారు తప్పు చేసినప్పుడు వారేం చెప్పదల్చుకున్నారో.. ఒకసారి పూర్తిగా వినండి. వాళ్లే పరిస్థితిలో ఆ పని చేశారో కనుక్కోండి. వాళ్లు చెప్పే కారణాలు నిజాయతీగా అనిపిస్తే మనసారా వాళ్లను క్షమించండి. దీనికోసం ఒక్కసారి మిమ్మల్ని మీరు వాళ్ల పరిస్థితిలో ఊహించుకొని ఆలోచించండి. ఓసారి క్షమించిన తర్వాత మళ్లీ వారి తప్పును గుర్తు చేసుకోకండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పాదాలు పదిలంగా
- స్లిట్... మరింత స్టైల్‌గా!
- చల్లటి పాలతో..!
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
ఆరోగ్యమస్తు
- కోపాన్ని తగ్గించే శశాంకాసనం!
- పోషకాల ‘పుట్ట’... ఆరోగ్యానికి ‘గొడుగు’
- అలసట లేకుండా పని చేయాలంటే..!
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
అనుబంధం
- మీరైతే ఏం చేస్తారు?
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
యూత్ కార్నర్
- ఒలింపిక్స్ బరిలో... బిహార్ ఎమ్మెల్యే!
- Paris Olympics: అందుకే ఈసారి వీళ్లు ప్రత్యేకం!
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- కత్రినా ‘స్లిమ్’ బాడీ.. ఆ సీక్రెట్స్ ఇవే!
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!