డెన్మార్క్‌లో ‘ఉగాది’ శోభ!

పండగంటేనే ఆనందాలకు, అనుబంధాలకు ప్రతీక! ఇలాంటి ప్రత్యేక సందర్భాన్ని బంధుమిత్రులతో జరుపుకోవడం మనకు ఆనవాయితీ! మరి, ఇలాంటి కుటుంబాలన్నీ ఒక్కచోట చేరితే ఆ సందడి, కోలాహలం మాటల్లో చెప్పగలమా? డెన్మార్క్‌లో స్థిరపడిన తెలంగాణ వాసుల ‘ఉగాది’ సంబరాలు ఈ ఆనందాల్న.....

Published : 02 Apr 2022 10:55 IST

పండగంటేనే ఆనందాలకు, అనుబంధాలకు ప్రతీక! ఇలాంటి ప్రత్యేక సందర్భాన్ని బంధుమిత్రులతో జరుపుకోవడం మనకు ఆనవాయితీ! మరి, ఇలాంటి కుటుంబాలన్నీ ఒక్కచోట చేరితే ఆ సందడి, కోలాహలం మాటల్లో చెప్పగలమా? డెన్మార్క్‌లో స్థిరపడిన తెలంగాణ వాసుల ‘ఉగాది’ సంబరాలు ఈ ఆనందాల్ని కళ్లకు కడుతున్నాయి. ‘తెలంగాణా అసోసియేషన్‌ ఆఫ్‌ డెన్మార్క్‌ (TAD)’ ఆధ్వర్యంలో కోపెన్‌హాగెన్‌లోని ఓ పాఠశాలలో ఇటీవలే నిర్వహించిన ఉగాది ఉత్సవాలు తెలుగు సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించాయి.

కరోనా ప్రతికూల పరిస్థితుల అనంతరం పెద్ద ఎత్తున, ఘనంగా నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆపై పంచాంగ శ్రవణం వినిపించారు. ఆట-పాటలు, డ్యాన్సులతో పిల్లలు-పెద్దలు సందడి చేశారు. ఈ క్రమంలో చక్కటి ప్రతిభ చూపిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పండగ సందర్భంగా తయారుచేసిన ఉగాది పచ్చడితో పాటు.. ఇతర పిండి వంటలు, శాకాహార వంటకాలతో విందు భోజనం ఆరగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ‘డెన్మార్క్‌లో భారత రాయబార కార్యాలయం అసిస్టెంట్‌ కాన్సులర్‌ ఆఫీసర్‌’ నీరజ్‌ కుమార్‌ దంపతులు హాజరయ్యారు. TAD అధ్యక్షులు బిల్లా సంగమేశ్వర్‌ రెడ్డితో పాటు తెలంగాణకు చెందిన కొన్ని కుటుంబాలు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్