లావుగా ఉన్నావంటూ విమర్శిస్తున్నాడు.. తట్టుకోలేకపోతున్నా!

నా వయసు 30 సంవత్సరాలు. నేను కాస్త లావుగా ఉంటాను. దాంతో ఈ విషయం గురించి నా భర్త ప్రతిసారీ విమర్శిస్తుంటాడు. మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఈ మధ్య విమర్శల స్థాయి ఎక్కువైంది. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తోంది.

Published : 15 Mar 2024 14:28 IST

నా వయసు 30 సంవత్సరాలు. నేను కాస్త లావుగా ఉంటాను. దాంతో ఈ విషయం గురించి నా భర్త ప్రతిసారీ విమర్శిస్తుంటాడు. మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఈ మధ్య విమర్శల స్థాయి ఎక్కువైంది. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తోంది. ఫలితంగా అతనిపై వ్యతిరేక భావనలు వస్తున్నాయి. బరువు తగ్గడానికి నా వంతు ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ ఫలితం ఉండడం లేదు. దీని ప్రభావం మా దాంపత్యంపై కూడా పడుతోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ శరీరాకృతి గురించి మీ భర్త పదే పదే విమర్శలు చేయడం వల్ల అది మీ అత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ముందుగా మీరు చర్చించాల్సింది మీ భర్తతోనే. అతని విమర్శల కారణంగా మీరు పడుతున్న మానసిక వేదన గురించి అతనికి అర్ధమయ్యేలా వివరించండి. అతను మీవైపు నుంచి ఆలోచించగలిగితే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. అంతేకాకుండా అతని నుంచి మీకు కావాల్సిన సహకారమూ అందే అవకాశం ఉంటుంది.

ఇక మీరు ఇప్పటికే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు. సాధారణంగా అధిక బరువు ఉన్నప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ భర్తతో కలిసి నిపుణులైన డాక్టర్‌ని సంప్రదించండి. వారు సూచించిన జాగ్రత్తలను పాటించడానికి ప్రయత్నించండి. ఈ విషయంలో మీ ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్తపడండి. అలాగే మీరు బరువు తగ్గడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి మీ భర్తకు తెలిసేలా చేయండి. దానివల్ల ఇద్దరి మధ్య అనుబంధమూ బలపడుతుంది.

అయితే కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అంతమాత్రాన నిరాశ చెందడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి, ఎలా ఉన్నా సరే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టండి. ఒకవేళ మీ భర్త వల్ల అప్పటికీ ఇబ్బందులు పడుతుంటే ఇద్దరూ కలిసి ఫ్యామిలీ కౌన్సెలర్‌ని సంప్రదించడం మంచిది. వారు మీ ఇద్దరితోనూ చర్చించి తగిన పరిష్కారం సూచిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్