ఆయన ఎక్కడికెళ్లినా ఆందోళనే.. ఎందుకిలా?!

నాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. ఇద్దరు పిల్లలున్నారు. నాకు చిన్నప్పటి నుంచి భయం, ఆందోళన ఎక్కువ. ఏ పని చేయాలన్నా ఏమవుతుందోనన్న భయం. ప్రయాణాలంటే మరీనూ! మా వారు ఎక్కడికి వెళ్లినా.. వచ్చేవరకు చాలా ఆందోళనగా ఉంటోంది. ఈమధ్య తలనొప్పి, నీరసం, ఒళ్లు నొప్పులు కూడా....

Published : 09 Dec 2022 12:47 IST

నాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. ఇద్దరు పిల్లలున్నారు. నాకు చిన్నప్పటి నుంచి భయం, ఆందోళన ఎక్కువ. ఏ పని చేయాలన్నా ఏమవుతుందోనన్న భయం. ప్రయాణాలంటే మరీనూ! మా వారు ఎక్కడికి వెళ్లినా.. వచ్చేవరకు చాలా ఆందోళనగా ఉంటోంది. ఈమధ్య తలనొప్పి, నీరసం, ఒళ్లు నొప్పులు కూడా వేధిస్తున్నాయి. దయచేసి నాలోని భయాలు పోయే మార్గం చెప్పండి. - ఓ సోదరి.

జ. కొంతమందిలో గాబరా అనేది వారి జీవితంలో భాగంగా ఉంటుంది. దీనిని anxious personality అంటారు. ఇలాంటివాళ్లు చిన్న విషయాలకు కూడా కంగారు పడిపోతుంటారు. ప్రతి పనిలోనూ సానుకూల అంశాలను పక్కన పెట్టి నెగెటివ్ విషయాల గురించి ఆలోచిస్తుంటారు. ఈక్రమంలో- మీరు చెబుతున్నట్లు కొంతమంది తలనొప్పి, నీరసం, ఒళ్లు నొప్పులు.. ఇలాంటి సమస్యలతో బాధపడే అవకాశం కూడా ఉండచ్చు. యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వారిలో చాలామంది ఎలాంటి చికిత్స తీసుకోరు. ఫలితంగా సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి, మీరు ముందుగా సైక్రియాట్రిస్ట్‌ని సంప్రదించండి. వారు మీ లక్షణాలను గమనించి తగిన మందులు సూచిస్తారు. అలాగే కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. తద్వారా మీరు మీ సమస్య నుంచి క్రమంగా బయటపడచ్చు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్