కలయికను ఆస్వాదించలేకపోతున్నా.. ఎందుకు?

హలో డాక్టర్. నా వయసు 27. నాకు పెళ్త్లె మూడేళ్త్లెంది. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ నాకు వెజైనా ఎక్కువ సమయం పాటు పొడిగా ఉండడంతో లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు చాలా నొప్పిగా అనిపిస్తుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ముందు ఒత్తిడి నుంచి బయటపడమని....

Published : 23 Mar 2023 14:03 IST

హలో డాక్టర్. నా వయసు 27. నాకు పెళ్త్లె మూడేళ్త్లెంది. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ నాకు వెజైనా ఎక్కువ సమయం పాటు పొడిగా ఉండడంతో లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు చాలా నొప్పిగా అనిపిస్తుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ముందు ఒత్తిడి నుంచి బయటపడమని సలహా ఇచ్చారు. అయినప్పటికీ నేను సెక్స్‌ని ఆస్వాదించలేకపోతున్నాను. నేను త్వరగా గర్భం ధరించే మార్గాలేంటో సూచించగలరు. - ఓ సోదరి

జ: లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు పొడిగా, నొప్పిగా ఉంటుందని అంటున్నారు. దీనికి మానసిక సంసిద్ధత లేకపోవడం కూడా కారణం కావచ్చు. మీరు లైంగిక చర్యకు మానసికంగా సిద్ధంగా లేనప్పుడు ఆ సమయంలో ల్యూబ్రికేషన్‌కి అవసరమయ్యే స్రావాలు జననాంగాల వద్ద ఉత్పత్తి కావు. అందుకే మీకు కలయిక సమయంలో జననాంగ ప్రాంతం పొడిగా ఉన్నట్లు అనిపిస్తోంది. కాబట్టి లైంగిక చర్య కోసం మీరు మానసికంగా సంసిద్ధం కావడానికి ప్రయత్నించండి. అయినప్పటికీ మీకు కలయిక సమయంలో పొడిగా, నొప్పిగా ఉంటే ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి పరీక్షలు చేయించుకోండి. అలాగే లైంగిక చర్య సవ్యంగా పూర్తయినప్పటికీ మీరు గర్భం ధరించడంలో సఫలం కాకపోతే అందుకు ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి మిగిలిన పరీక్షలు కూడా చేయించుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్