సారీతోనే సరిపోదు
close
Published : 28/11/2021 01:29 IST

సారీతోనే సరిపోదు!

జీవిత భాగస్వామిని బాధపెట్టాక కొందరు సారీ చెప్పి, బాధ్యత తీరిపోయిందనుకుంటారు. ఎదుటివారి మనసులో బాధ తగ్గిందో లేదో కూడా గుర్తించరు. ఇలాంటి మొక్కుబడి క్షమాపణలు దంపతుల మధ్య దూరాన్నే పెంచుతాయి తప్ప తగ్గించవు. కాబట్టి, మనస్ఫూర్తిగా ప్రయత్నించమంటున్నారు మానసిక నిపుణులు.

బాధపెట్టి సరైన రీతిలో క్షమించమని అడగకపోతే అవతలివారు నిరుత్సాహపడతారు. వారి వేదన మరింత పెరగొచ్చు. మీ విచారాన్ని మృదువైన మాటల్లో వ్యక్తం చేయగలగాలి. అయినా వారిలో మార్పు కనిపించకపోయినా... కోపాన్ని ప్రదర్శించకూడదు. మీ సంజాయిషీ వినగానే వారి మనసులోని బాధ ఆవిరిలా మాయమవ్వాలని లేదు కదా! వారి కోపం తగ్గించడానికి ఓపికగా ప్రయత్నించాలి.

* బాధ్యతను అంగీకరించడం.. కొందరు కోపంలో భాగస్వామిని కించపరుస్తారు. లేదా  మాటలతో బాధపెడతారు. కోపం తగ్గాక కానీ నోరు జారిన విషయం అర్థమవదు. తీరా ఒప్పుకోవడానికేమో మనసు అంగీకరించదు. ఈ తరహా అహం బంధానికి మంచిది కాదు. తప్పు అనిపిస్తే ఒప్పుకోవాలి. పూర్తిబాధ్యతనూ తీసుకోవాలి. మరోసారి ఇలా జరగదంటూ భరోసా ఇవ్వాలి. ఇలాంటి ప్రవర్తన ఎదుటివారిలో క్రమేపీ మార్పును తీసుకొస్తుంది. అవతలి వారి మనసును గెలవడానికి పశ్చాత్తాపాన్ని ప్రదర్శించడమే కాదు, ఏర్పడిన దూరాన్నీ తగ్గించుకునే ప్రయత్నమూ నిజాయతీగా చేయాలి.

* అభ్యర్థించడంలో... క్షమాపణలో పారదర్శకత కనిపించాలి. అలాకాకుండా కాసేపు ఒంటరిగా ఉంటే చాలు.. కోపం అదే పోతుంది అని ఆలోచించొద్దు. తన భావోద్వేగాలపై పట్టింపు లేదనో, నిర్లక్ష్యమనో భావించే ప్రమాదం ఉంది. కాస్త ఓపికగా జరిగిన దాని గురించి ప్రశాంతంగా చర్చించుకుంటే చాలు. ఇరువురి మనసులూ తేలికవుతాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని