బంధానికి కబుర్ల మందు!

ఆలుమగల బంధం ఎంత ఆత్మీయమైనదైనా చిన్న చిన్న పేచీలూ, కీచులాటలూ మామూలే. అవి గొడవలుగా, వాగ్యుద్ధాలుగా మారకుండా ఉండాలంటే ఈ మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిందే!ఇద్దరి

Published : 21 Jan 2022 00:41 IST

ఆలుమగల బంధం ఎంత ఆత్మీయమైనదైనా చిన్న చిన్న పేచీలూ, కీచులాటలూ మామూలే. అవి గొడవలుగా, వాగ్యుద్ధాలుగా మారకుండా ఉండాలంటే ఈ మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిందే!

ద్దరి మధ్యా భేదాభిప్రాయం వస్తే దాన్ని ఆ విషయానికే పరిమితం చేయండి. మీకు తోచింది మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా అవతలి వ్యక్తి చెప్పేది కూడా వినండి. కోపతాపాలకు తావు లేకుండా ఆలోచిస్తే ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్పష్టత వస్తుంది.

ముందు వినండి.. మీ భర్త ఆఫీసు నుంచి రావడం ఆలస్యమైందనుకోండి.. ఎంత ఆదుర్దా ఉన్నా సరే, ఇంట్లో అడుగుపెట్టగానే ఎందుకు, ఏమిటి అంటూ ఆవేశాలు ప్రకటించవద్దు. రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకోనిచ్చి విషయమేమిటో ఆరా తీయండి. కనీసం ఫోన్‌ చేసి చెబితే ఆందోళన చెందను కదాని చెప్పండి. ఈ పద్ధతి వల్ల మరోసారి అలా జరగదు.

కబుర్లు చెప్పుకోండి.. ఎన్ని పనులున్నా, ఎంత తీరిక లేకున్నా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయండి. ఇలా చేయడం వల్ల అలసట తీరడమే కాదు, ఇద్దరి మధ్యా ఎలాంటి అపార్థాలకూ తావు లేకుండా అనుబంధం బలపడుతుంది. మంచీ చెడూ ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోండి.

పనిలో సాయం.. పండ్లు కోయడం, కొబ్బరి తురమడం, సలాడ్‌ చేయడం లాంటి చిన్న చిన్న పనులు భర్తకు అప్పగించండి. అతను చేసిన సాయానికి కృతజ్ఞత తెలియజేయండి. చక్కగా చేసినందుకు ప్రశంసించండి. ఇదంతా ఇంట్లో అందమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

నిజాయతీ.. అతి చిన్న విషయానికి  అబద్ధం చెప్పొద్దు. కోపతాపాలు వస్తాయేమోనని నిజాన్ని దాచినా, దాటేసినా అది అపనమ్మకానికి బీజమేస్తుంది.

ఆవేశం.. ఆక్రోశం..

ఆవేశాలూ ఆక్రోశాల వల్ల ఒరిగేదేమీ ఉండదు, ఇద్దరి మధ్యా విభేదాలు పెరగడం తప్ప. కోపతాపాలు నోటికి అదుపు లేకుండా చేస్తాయి. అవి కోపద్వేషాలకు దారితీస్తాయి. ఆ క్షణం ఓర్చుకున్నారంటే తర్వాత పరిస్థితి మామూలైపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్