మొబైల్‌ లేనిదే ముద్ద తినరా?
close
Published : 28/01/2022 00:47 IST

మొబైల్‌ లేనిదే ముద్ద తినరా?

అన్నం తిననని మారాం చేసే పిల్లలకు చందమామని చూపించి తినిపించేవాళ్లు పాతతరం. ఇప్పటివాళ్లకి ఆ స్థానంలోకి మొబైల్‌, టీవీ వచ్చి చేరాయి. ఇప్పుడు అవి లేనిదే నోరు తెరవమని మారాం చేసే గడుగ్గాయులే ఎక్కువ. ఈ తీరు అంత మంచిది కాదనేది నిపుణుల మాట. మరి మార్చేదెలా? ఇదిగో.. ఇలా!

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులవ్వడం, మారాం చేయడం ఆపుతారనో, త్వరగా తినేస్తారనో ‘తెర’లను అలవాటు చేయడం మొదలైంది. లాక్‌డౌన్‌ తర్వాత వీటి అవసరం దాదాపు ప్రతి ఇంట్లోనూ తప్పనిసరి అయ్యింది. పరిస్థితుల్లో మార్పు వచ్చినా అది ఉంటేగానీ తినమనే పిల్లలే ఎక్కువ. కానీ దాన్ని ఇకనైనా కొనసాగనివ్వకండి. ఆరోజుకి తిన్నారనిపించినా దీర్ఘకాలంలో వారికి ఆహారంపై అనాసక్తిని కలగజేస్తుంది. తినే విధానమూ తెలియదు. కొన్నిసార్లు ఎంత తింటున్నారనేదీ తెలియక అతిగా తినేసి జీర్ణసంబంధ సమస్యలు, ఊబకాయానికీ కారణమవుతాయి. కాబట్టి..

* సమయం నిర్ణయించండి.. ఒక్కసారిగా గ్యాడ్జెట్లకు దూరం చేయాలని చూడకండి. అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ముందు నిర్ణీత సమయాన్ని కేటాయించండి. దానిలోగా పూర్తిచేయాలని చెప్పండి. అవసరమైతే ఈ విషయంలో కఠినంగానే ఉండండి. దీంతో త్వరగా తినేయాలన్న దానిపైనే ధ్యాస ఉంటుంది.

* కొత్తవొద్దు.. ఫోన్‌ దూరం చేయాలన్న పట్టుదలతో చాలామంది పుస్తకాలు, పజిల్స్‌ వంటివి అలవాటు చేయాలనుకుంటారు. తినేటప్పుడు దృష్టిని మరల్చే ఏదైనా మంచిది కాదు. బదులుగా వాళ్లతో కలిసి తినడం, కబుర్లు చెప్పడం లాంటివి చేయండి. బొమ్మలను పక్కన పెట్టుకోనివ్వండి. త్వరగా తింటే ఆడుకోవచ్చన్న ఉద్దేశంతో అయినా తిండిపై దృష్టిపెడతారు.

* నియమం పెట్టుకోండి.. రోజులో ఒక్కపూటైనా కలిసి తినాలనే నియమం పెట్టుకోండి. ఎంత బిజీగా ఉన్నా దాన్ని పాటించండి. ఇదీ వాళ్లలో మంచి అలవాట్లను పెంపొందిస్తుంది. ఆ సమయంలో పెద్దలూ ఫోన్లను పక్కన పెట్టేయాలి. అప్పుడూ పిల్లలూ పాటిస్తారు.


Advertisement

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి