కథలు చెబుతూ నేర్పేయండి!

పిల్లలు నాన్నమ్మ, తాతయ్యల ముద్దు ముచ్చట్ల మధ్య పెరిగితే ఇబ్బంది ఉండదు.  కానీ పెద్దవాళ్లకు దూరంగా ఉంటున్న జంటలకు పిల్లల పెంపకం జటిలమపిస్తుంది. అందుకే ఈ సూత్రాలు పాటించి చూడండి...

Published : 15 Feb 2022 02:00 IST

పిల్లలు నాన్నమ్మ, తాతయ్యల ముద్దు ముచ్చట్ల మధ్య పెరిగితే ఇబ్బంది ఉండదు.  కానీ పెద్దవాళ్లకు దూరంగా ఉంటున్న జంటలకు పిల్లల పెంపకం జటిలమపిస్తుంది. అందుకే ఈ సూత్రాలు పాటించి చూడండి...

* చిన్నారులు చాక్లెట్లు, బిస్కెట్ల లాంటివే ఎక్కువ ఇష్టపడతారు. కానీ పోషకాహారం తినేలా చూడండి. అప్పుడే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
* తోటి పిల్లలతో పేచీ పడుతుంటే కొద్ది సేపు పట్టించుకోవద్దు. చాలాసార్లు పెద్దల జోక్యం లేకుండానే సమసిపోతాయి. మీ చిన్నారి తరచుగా గొడవపడుతుంటే లేదా ఇతరుల వల్ల ఇబ్బందిపడుతూ వాళ్లతో కలవడానికి భయపడుతుంటే మాత్రం సమస్యను పరిశీలించి, పరిష్కరించండి.
* పిల్లల అవసరాలు తీర్చడంతో మన బాధ్యత తీరిపోదు. వాళ్లకు ప్రేమ చాలా అవసరం. ఆత్మీయంగా కబుర్లు చెప్పండి. మాటలు మంత్రాల్లా పని చేస్తాయంటే అతిశయోక్తి కాదు. వీలైనప్పుడల్లా మంచి విషయాలు చెబుతుండండి. వాళ్లు చెప్పేది వినండి. అన్నం తినిపించేటప్పుడు, నిద్ర పుచ్చేటప్పుడు టీవీ ముందు కూర్చోబెట్టడం కంటే కథల పుస్తకాలు దగ్గరుంచుకుని బొమ్మలు చూపుతూ చదివి వినిపించండి. దీని వల్ల వారికి చదవడం అలవడుతుంది.
* మాటకు కట్టుబడి ఉండటం, సమయ పాలన, చిన్నచిన్న పనులు వేగంగా చేయడం లాంటివి చిన్నప్పుడే అలవాటు చేయాలి. పెద్దలను గౌరవించడం, స్థాయీ భేదాలు లేకుండా అందర్నీ సమానంగా చూడటం, తోటి పిల్లలతో స్నేహంగా ఉండటం లాంటి విషయాలను కథల రూపంలో అర్థమయ్యేలా చేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్