కొత్తకోడలా... కొన్ని సంగతులు!

మిసెస్‌ పర్‌ఫెక్ట్‌ అనిపించుకోవాలా.. చాలా మంది అమ్మాయిలు అత్తగారింట అడుగు పెట్టిన రోజు నుంచి అన్ని పనులూ చకచకా చేస్తూ ఆల్‌ రౌండర్‌ అనిపించుకోవాలి అనుకుంటారు. నిజమే.. మీరన్నింటా పర్‌ఫెక్ట్‌ కావొచ్చు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి.

Published : 01 Mar 2022 00:46 IST

మిసెస్‌ పర్‌ఫెక్ట్‌ అనిపించుకోవాలా.. చాలా మంది అమ్మాయిలు అత్తగారింట అడుగు పెట్టిన రోజు నుంచి అన్ని పనులూ చకచకా చేస్తూ ఆల్‌ రౌండర్‌ అనిపించుకోవాలి అనుకుంటారు. నిజమే.. మీరన్నింటా పర్‌ఫెక్ట్‌ కావొచ్చు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. కోడలిగా, కుటుంబంలో ముఖ్యవ్యక్తిగా అది మీ ఇల్లు. వేరొకరి మెప్పు కోసం మీ శక్తికి మించి కష్టపడొద్దు. తెలియని విషయాలను అత్త మామలు, ఇతర కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోండి. రాని పనులు నేర్చుకోండి. మొత్తానికి మీరు మీలా ఉండండి. పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తే ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది.

బంధాలు... పదిలం... వ్యక్తులు కలిస్తేనే కుటుంబం. అత్తామామల పట్ల గౌరవం, ఆడబడుచులు, మరుదుల పట్ల అభిమానం..  తోటికోడళ్లతో సఖ్యత... ఇలా అన్ని బంధాలనూ సమన్వయం చేసుకోవాలి. అందరితో కలివిడిగా ఉంటూ... గౌరవ, మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి. ఎవరినీ కించ పరచొద్దు. హేళనగా మాట్లాడొద్దు. ఇలా చేస్తే వారి మనసులు నొచ్చుకుని బంధాలు బలహీనమవుతాయి.

దృఢంగా ఉండాలి.. ఆత్మవిశాస్వంతో ఉండాలి. ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలి. అంటే ఇతరులను ఎదిరించమని కాదు. మీ నమ్మకాలకు విలువనిస్తూనే.... కుటుంబ విలువలనూ గౌరవించాలి. అంతేకానీ జీవితాంతం ఎదుటి వారు తప్పులను మౌనంగా భరించమని కాదు.

త్యాగాలొద్దు... సర్దుకుపోవడానికి.. పూర్తిగా వదిలేయడానికి/ భరించడానికి చాలా తేడా ఉంటుంది. కుటుంబం అన్నాక కొన్ని చిన్నా చితకా విషయాల్లో భర్త, ఇతర సభ్యులతో సర్దుకుపోవాలి. అయితే ఇది అలవాటుగా మారొద్దు. మీకు నచ్చిన వస్తువు/అంశాల్లో పదే పదే ఇతరుల అధికారం ఎక్కువైతే మాత్రం వారిని కూర్చోబెట్టి పరిస్థితిని వివరించాలి.

గొడవలొద్దు... ప్రతి వ్యక్తిలోనూ లోపాలుంటాయి. వాటిని భూతద్దంలో చూసి గొడవకు దిగొద్దు. సానుకూలంగా ఆలోచించాలి. హుందాగా ప్రవర్తించాలి. ఒకవేళ ఎదుటివారు గొడవకు దిగినా అక్కడి నుంచి వెళ్లిపోండి. ఇలా చేస్తే మీరు బలహీనులని కాదు... వారి ఆవేశం తగ్గాక స్థిమితంగా మాట్లాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్