వాళ్లకేం కావాలో అడగనివ్వండి...

ఇందు తన స్నేహితులతో పిల్లలు తనెదుట నోరు విప్పరని, భయ భక్తులతో ఉంటారని చెబుతుంటుంది. ఇలా ఇంట్లో మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే వారి ప్రవర్తన బయట మరోలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అమ్మానాన్నలతో మనసులో మాటను చెప్పేలా, వాళ్లకేం కావాలన్నా అడిగేలా పెంచాలంటున్నారు.

Updated : 02 Apr 2022 00:25 IST

ఇందు తన స్నేహితులతో పిల్లలు తనెదుట నోరు విప్పరని, భయ భక్తులతో ఉంటారని చెబుతుంటుంది. ఇలా ఇంట్లో మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే వారి ప్రవర్తన బయట మరోలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అమ్మానాన్నలతో మనసులో మాటను చెప్పేలా, వాళ్లకేం కావాలన్నా అడిగేలా పెంచాలంటున్నారు.
పిల్లలకు బాల్యం నుంచే స్వేచ్ఛనివ్వాలి. చిన్నచిన్న విషయాల్లోనూ వారి అభిప్రాయం, స్పందనకు విలువనివ్వాలి. ‘పిల్లలు మీకు తెలుసా... మాకు తెలుసా’ అని గదమాయిస్తారు చాలామంది పెద్దలు. అది సరి కాదు. వారికేం కావాలో చెప్పనివ్వాలి. అది వారికి చాలా ముఖ్యమైనది కావొచ్చు. ఆ భావనను తల్లిదండ్రులు గౌరవించాలి. ఏం కావాలి అని అడిగితే స్తోమతకు మించింది కోరతారనే భయం పెద్దవారిలో ఉంటుంది. అయినా సరే వారి ఆలోచనను ముందే ఖండించకూడదు. ప్రశాంతంగా వినాలి. తర్వాత సాధ్యాసాధ్యాలు వివరంగా చెప్పాలి. లేదా మున్ముందు ఆ కోరికను తీర్చగలమనే భరోసా ఇస్తే చాలు.

నైపుణ్యాలు.. తమ పనులను తామే పూర్తి చేసుకోగలిగే నైపుణ్యాలను చిన్నప్పటి నుంచి నేర్పాలి. దాంతో ఏదైనా సమస్యలొచ్చినప్పుడు పెద్ద వాళ్లపై ఆధారపడకుండా వారే పరిష్కరించుకోగలుగుతారు. ఈ నైపుణ్యం వారికి తమ అవసరాలు, తమకు కావాల్సిన వాటిపై అవగాహననూ పెంచుకుంటారు. అలాగే చిన్నారులకు మనసులోని మాటను ధైర్యంగా చెప్పేలా స్వేచ్ఛనివ్వాలి. దాంతో పాటు సమయం, సందర్భాన్ని గుర్తించి మాట్లాడేలా పెంచాలి. ఇవన్నీ వారిని మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.

రుగ్మతలుగా.. తమకిష్టమైనది అడగాలంటే భయపడే చిన్నారుల్లో పలు మానసిక రుగ్మతలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ప్రతి చిన్న అంశాన్ని మనసులో పెట్టుకుని ఉండిపోవడం అలవడుతుంది. దీంతో అంతర్ముఖులుగా మారతారు. లేదా వారికేం కావాలో వారికే తెలీకుండా ఎదుగుతారు. తమ అభిప్రాయానికి విలువలేదనే ఆత్మనూన్యతకూ గురవుతారు. ఈ ప్రమాదాలేవీ జరగకుండా ఉండాలంటే పిల్లలకు ఇంటి నుంచే స్వేచ్ఛ మొదలవ్వాలి. అప్పుడే వారిలో మానసికవికాసం పెరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్