పిల్లలనెక్కువగా పొగుడుతున్నారా...

ఇందుమతి కూతురికి పట్టుమని పదేళ్లు నిండలేదు. తాను చెప్పిందే సరైనదని మొండి పట్టు పడుతుంది. ఎదుటి వారు చెప్పేది వినదు. అన్నీ తనకే తెలుసన్నట్లు ప్రవర్తిస్తుంది. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి తల్లిదండ్రులు చేసే ప్రశంస మోతాదు ఎక్కువైతే వచ్చే విపరిణామమే ఇదంటున్నారు నిపుణులు. అమితంగా పొగిడితే అది అతి ఆత్మవిశ్వాసంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Published : 17 Mar 2022 00:40 IST

ఇందుమతి కూతురికి పట్టుమని పదేళ్లు నిండలేదు. తాను చెప్పిందే సరైనదని మొండి పట్టు పడుతుంది. ఎదుటి వారు చెప్పేది వినదు. అన్నీ తనకే తెలుసన్నట్లు ప్రవర్తిస్తుంది. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి తల్లిదండ్రులు చేసే ప్రశంస మోతాదు ఎక్కువైతే వచ్చే విపరిణామమే ఇదంటున్నారు నిపుణులు. అమితంగా పొగిడితే అది అతి ఆత్మవిశ్వాసంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

చిన్నారులను ప్రశంసించడంలో అతి చేయడం, ఇతరులతో పోల్చి నువ్వే గొప్ప అని ఎక్కువగా పొగడటం వంటివన్నీ వారిలో చిన్నప్పటి నుంచే అమితమైన ఆత్మవిశ్వాసాన్ని పెరిగేలా చేస్తాయి. దీంతో వీరు ప్రతి అడుగూ ఇతరుల ప్రశంసలు, పొగడ్తల కోసమే వేయడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకూ ఏమీ తెలీదనే స్థితికి చేరుకుంటారు. తాము చెప్పేదే వేదమనే ఆలోచన వారితోపాటే పెరుగుతుంది. మీరు ఇచ్చే పొగడ్త సానుకూల ప్రభావం పడేలా మాత్రమే ఉండాలి. చదువులో సామర్థ్యం ప్రదర్శించిన లేదా ఇతరులకు చేయూతనందించిన సందర్భాల్లో అందించే ప్రశంస వారిని మరింత ముందుకు నడిపించేలా చేస్తుంది. ఇతరులను విమర్శించినప్పుడు, తోటివారితో పోట్లాడేటప్పుడు పొగిడితే మాత్రం చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది.

వ్యక్తిగతంగా వద్దు...

పొగిడేటప్పుడు చేసిన మంచి పనులను ఉదహరించాలి. అంతే తప్ప వ్యక్తిగత ప్రశంసలు ఇవ్వొద్దు. అప్పుడే వారు చేసిన పని ఎంత మంచిదో అనే అవగాహన వస్తుంది. వారిని వారు గొప్పగా చిత్రీకరించుకోకుండా, మరో మంచి పని చేయడానికి పూనుకొంటారు. అలాగే ఇతర చిన్నారులతో పోలుస్తూ ప్రశంసిస్తే, ప్రతి చిన్న అంశంలోనూ ఇతరులతో పోల్చుకోవడం అలవాటుగా మారుతుంది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల సంతోషం కోసం కారణం లేకపోయినా నిత్యం పొగుడుతూనే ఉంటారు. ఈ పద్ధతి కూడా సరైనది కాదంటున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్