వారిని ప్రేమతో... మార్చుకోవాలి

రమాదేవికి ఎనిమిదేళ్ల కూతురుంది. ఇంటికెవరైనా బంధువులు, స్నేహితులొచ్చినప్పుడు తన ప్రవర్తన మారుతుంది. అందరి ఎదుట అమ్మని ఎంత మాటైనా వెనుకాడకుండా అనేస్తుంది. ఈ మార్పు వారిలో ఎందుకొస్తుందో గుర్తించాలి అంటున్నారు నిపుణులు. ఎదుటివారి ముందు ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో నేర్పించాలి

Updated : 23 Mar 2022 05:56 IST

రమాదేవికి ఎనిమిదేళ్ల కూతురుంది. ఇంటికెవరైనా బంధువులు, స్నేహితులొచ్చినప్పుడు తన ప్రవర్తన మారుతుంది. అందరి ఎదుట అమ్మని ఎంత మాటైనా వెనుకాడకుండా అనేస్తుంది. ఈ మార్పు వారిలో ఎందుకొస్తుందో గుర్తించాలి అంటున్నారు నిపుణులు. ఎదుటివారి ముందు ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో నేర్పించాలి.  వీటిని అలవరచాలంటే వారిపట్ల పెద్దవాళ్లు ప్రేమగా, సున్నితంగా ప్రవర్తించాలంటున్నారు.

చూసి నేర్చుకుంటే... తోటి పిల్లలు, ఇంట్లో తోబుట్టువులు లేదా తల్లిదండ్రుల ప్రవర్తన చూసి పిల్లలు చాలా నేర్చుకుంటారు. చూసి నేర్చుకోవడం మాత్రమే తెలిసే బాల్యాన్ని మంచి అలవాట్లతో నింపే బాధ్యత తల్లిదండ్రులదే. వారెదుట పెద్దవాళ్లు ఒకరినొకరు మాటలతో నిందించుకోవడం, అవమానించుకోవడం వంటివి చేస్తే వారి మనసులో ఆయా వ్యక్తులపై కొన్ని స్థిరమైన అభిప్రాయాలను ఏర్పరుచుకుంటారు. ఎవరైనా వచ్చినప్పుడు తమ మాటల్లో వాటిని ఉపయోగిస్తారు. ఈ సందర్భాల్లో పిల్లలను దండించకూడదు. ఎదుటివారి ముందు వారిని అవమానించకూడదు. ముందుగా ఇంటి వాతావరణం పిల్లలకు అనువుగా ఉందా లేదా ఆలోచించాలి. వారి శారీరక ఎదుగుదల కోసం ఆహారాన్ని ఎలా తినిపిస్తామో, అలాగే వారి మానసికారోగ్యాన్ని పెంపొందించేలాగా వాతావరణాన్ని కల్పించాలి.  

భయపెట్టి.. కొందరు చిన్నారులేదైనా పొరపాటు చేస్తే క్రమశిక్షణ లేదంటూ వారిని భయపెట్టడానికి పెద్దవాళ్లు చూస్తారు. మరికొందరైతే మరో సారి ఇలా ప్రవర్తించావంటే ఇంట్లోంచి గెంటేస్తా అని బెదిరిస్తారు. ఇవన్నీ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. క్రమశిక్షణ మాట అటుంచి వారు మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. ఇది పెద్దవాళ్లపై కోపంగానూ మారే ప్రమాదం ఉంది. దీంతో చదువులో వెనకబడటం, తోటి పిల్లలతో కలిసి ఆడకపోవడం లేదా ఎవరైనా వచ్చినప్పుడు వారి కోపాన్ని ప్రదర్శించడం వంటివి చేస్తారు. చిన్నచిన్న పొరపాట్లు చేసినప్పుడు పిల్లలను దండించడం, భయపెట్టడం కాకుండా ప్రేమగా దగ్గరకు తీసుకొని అది సరైనది కాదని నెమ్మదిగా చెబితే చాలు. క్రమేపీ వారిలో మార్పు కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్