ఇంటి నుంచే ధైర్యం..

రమ కూతురిని కాలేజీలో చేరుస్తోంది. అక్కడ ఈవ్‌ టీజింగ్‌ జరుగుతుందని భయపడుతోంది. దీనిపై ఆడపిల్లలకు అవగాహన కలిగించాలంటున్నారు నిపుణులు. లైంగిక వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌ వంటి

Published : 24 Mar 2022 01:37 IST

రమ కూతురిని కాలేజీలో చేరుస్తోంది. అక్కడ ఈవ్‌ టీజింగ్‌ జరుగుతుందని భయపడుతోంది. దీనిపై ఆడపిల్లలకు అవగాహన కలిగించాలంటున్నారు నిపుణులు. లైంగిక వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌ వంటి వాటిని ఎదుర్కోగలిగే ధైర్యాన్ని ఆడపిల్లల్లో తల్లిదండ్రులు నింపాలని సూచిస్తున్నారు.

అవగాహన... యుక్తవయసుకొచ్చిన తర్వాత ఆడపిల్లల్లో జరిగే శారీరక, హార్మోన్ల మార్పులు కొంత ఆందోళనను కలిగిస్తుంటాయి. వీటితో పాటు లైంగిక వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌ వంటివి మరింత ఒత్తిడికి గురిచేస్తాయి. అందుకే చిన్నప్పటి నుంచి వీటిపై అవగాహన తేవడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి. లేదంటే వారికెదురయ్యే అనుభవాలను ఇంట్లో చెబితే ఏమనుకుంటారో అనే భయం ఉండి …పోతుంది. కుంగుబాటుకు గురవుతారు. బయటకు వెళ్లడానికి ఆసక్తి చూపించరు. నలుగురితో కలవరు. ఒంటరిగా ఉంటారు. ఇది తీవ్ర పరిణామాలకూ దారి తీయొచ్చు. అందుకే పిల్లలతో ఈ అంశాలపై చర్చించాలి. వారి అభిప్రాయాలను చెప్పే స్వాతంత్య్రాన్నివ్వాలి. ఎవరో ఏదో అన్నారని పిల్లలు చెబితే.... వెంటనే నీదే తప్పు అని నిందించకూడదు. వారి అనుభవాలను ధైర్యంగా అమ్మానాన్నలతో పంచుకొనేలా పెంచాలి. అప్పుడే వారి సమస్యలను చెప్పడానికి వెనకడుగు వేయరు.

ఎదుర్కొనేలా.. కొన్ని సార్లు విపత్కర పరిస్థితులెదురవుతాయి. లైంగిక దాడి జరగబోతోంటే ఎలా తప్పించుకోవాలో నేర్పాలి. ప్రస్తుతం ఎన్నో యాప్‌లు వచ్చాయి. వీటి వినియోగం చెప్పి, వారి ఫోన్లలో పొందుపరిస్తే అత్యవసర సమయాల్లో ఉపయోగపడతాయి. బయటికెళ్లేటప్పుడు పరిసర ప్రాంతాలపై అవగాహన ఉండాలనే విషయం చెప్పాలి. ఏ పరిస్థితులెదురైనా ధైర్యంగా దాటి రాగలిగే మానసికస్థైర్యం ఆడపిల్లలకు అలవరచాలి. ఈవ్‌టీజింగ్‌ చేస్తుంటే ధైర్యంగా ఎదుర్కొని అవతలి వ్యక్తికి బుద్ధి చెప్పేలా ఆడపిల్లలను పెంచాలి. స్వీయ రక్షణ కూడా ఎంతో ముఖ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్