ఒకరి కోసం ఒకరుగా...

చాలా పనులు మనమే చేసుకోగలం. కానీ ఆత్మీయత, అనురాగాలు మాత్రం మనకు మనం ఇచ్చుకునేవి కాదు. మన ప్రవర్తన, చేష్టలను ఇతరులు ఇష్టపడుతుంటే, మెచ్చుకుంటే అంతకంటే ఆనందం ఇంకోటుండదు. ముఖ్యంగా భార్యాభర్తలు పరస్పరం ఇష్టపడుతూ గౌరవించుకుంటూ ఉంటే ఇక ఆ ఇంట సంతోషాల పంటే...

Published : 27 Mar 2022 00:50 IST

చాలా పనులు మనమే చేసుకోగలం. కానీ ఆత్మీయత, అనురాగాలు మాత్రం మనకు మనం ఇచ్చుకునేవి కాదు. మన ప్రవర్తన, చేష్టలను ఇతరులు ఇష్టపడుతుంటే, మెచ్చుకుంటే అంతకంటే ఆనందం ఇంకోటుండదు. ముఖ్యంగా భార్యాభర్తలు పరస్పరం ఇష్టపడుతూ గౌరవించుకుంటూ ఉంటే ఇక ఆ ఇంట సంతోషాల పంటే... అలా ఉండాలంటే ఈ మాత్రం చేస్తే చాలునంటున్నారు ఫ్యామిలీ కౌన్సిలర్లు...

* రోజూ ప్రతి పనికీ సమయం పెట్టుకోండి. ప్రేమకీ దీనికీ సంబంధమేమిటి అనుకోవద్దు. క్రమశిక్షణ, సమయపాలన వ్యక్తి మీద గౌరవాన్ని పెంచుతాయి. పనులు నింపాదిగా చేస్తున్నా, బాధ్యత లేకుండా సోమరిగా ఉన్నా ఆ వ్యక్తి పట్ల చులకనభావం కలుగుతుంది. ఎప్పుడన్నా అయితే బద్ధకం అని సరిపెట్టుకుంటారు. వైఖరే అలా ఉంటే వ్యతిరేకత చోటుచేసుకుంటుంది.

* ఆలుమగలు ఇద్దరికీ ఎవరి బాధ్యతలు వాళ్లకుంటాయి. అవి నెరవేర్చుకుంటూనే ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించండి. వాళ్లకు సంబంధించిన పనిని మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయండి. అది మీ పట్ల ప్రేమను రెట్టింపు చేస్తుంది.

* భార్యాభర్తలైనంతలో ఇద్దరూ ఒకేలా ఆలోచించాలని లేదు. కొన్ని కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాంటప్పుడు  కోపతాపాలకి బదులు ‘నువ్విలా అంటున్నావు.. కానీ నాకిలా అనిపిస్తోంది.. రెండిట్లో లాభనష్టాలేంటో అంచనా వేద్దాం.. మెరుగైన దాన్ని ఆచరణలో పెడదాం’ అని సానునయంగా చెప్పి చూడండి. అవతలి వ్యక్తి ఎంతో సామరస్యంగా ఆలోచిస్తారు.

* మీ భాగస్వామి పెద్ద పెద్ద ఘనకార్యాలు చేసినప్పుడే కాదు.. ఏ చిన్న మంచి పని చేసినా, ఆఖరికి మీ కోసం ఐస్‌క్రీం కప్పులో వేసిచ్చినా కృతజ్ఞతలు తెలియజేయండి. మీరలా గుర్తించడం వల్ల మీ మీద అభిమానం పెరుగుతుంది.

* మన మనసులో భావాలు తెలియజేయడం చాలా అవసరమే. కానీ వినడం కూడా అంతే ముఖ్యం. అవతలి వ్యక్తి చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్నారని అర్థమైతే వాళ్లకి సంతోషంగా అనిపిస్తుంది. అది మీ పట్ల ఇష్టాన్ని, గౌరవాన్ని పెంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్