జీవిత భాగస్వామి కోసం...

సుకన్య, రాజు పెళ్లై ఎన్నో ఏళ్లైనా సంతోషంగా కనిపిస్తారు. వారి పక్క ఫ్లాట్‌లో లక్ష్మి, రావు మాత్రం నిత్యం ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూనే ఉంటారు. జీవిత భాగస్వామిని ఆనందంగా

Published : 02 Apr 2022 03:05 IST

సుకన్య, రాజు పెళ్లై ఎన్నో ఏళ్లైనా సంతోషంగా కనిపిస్తారు. వారి పక్క ఫ్లాట్‌లో లక్ష్మి, రావు మాత్రం నిత్యం ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూనే ఉంటారు. జీవిత భాగస్వామిని ఆనందంగా ఉంచాలని ఎవరికి వారు ప్రయత్నిస్తే... ఆ సంసారమంతా సంతోషమే అంటున్నారు మానసిక నిపుణులు.

ఉద్యోగ బాధ్యతల్లో ఎవరికి వారు బిజీగా ఉంటున్న ఈ కాలంలో ఎక్కువ సమయం కలిసి గడపడం కుదరడం లేదు. కాబట్టి దొరికిన సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి. ఎదుటి వారికిష్టమైన దుస్తులు ధరించడం, ఇష్టమైన సినిమా చూడటం, కావాల్సిన సామాన్లను కలిసి తెచ్చుకోవడం, నచ్చిన వంటకాన్ని కలిసి తయారు చేసి, క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌గా తీసుకోవడం... వంటివన్నీ మధుర జ్ఞాపకాలుగా నిలుస్తాయి.

ప్రశంస.. దంపతుల్లో ఒకరి కోసం మరొకరు ఏదైనా చిన్న పని చేసినా కృతజ్ఞతలు చెప్పాలి. ఇంట్లో వారికి చెప్పడమేంటి అనుకోవద్దు. అది అవతలి వారిని సంతోషపెడుతుంది. ఎవరికైనా చేయూతనిచ్చినప్పుడు ప్రశంసించాలి. అది వారికి ప్రోత్సాహ మవుతుంది. మీపై గౌరవాన్ని పెంచుతుంది. ఎందుకలా చేశావు, నాతో చెప్పకుండా నీకిష్టం వచ్చినట్టు చేస్తున్నావంటూ విమర్శలు మొదలుపెడితే అవతలి వ్యక్తి మానసికంగా దూరమవుతారు. మీ ప్రోత్సాహంతోపాటు ఆ మంచి పనిలో భాగస్వాములైతే వారికి మరింత సంతోషాన్ని కలిగిస్తుంది.

ఆరోగ్యం.. భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్యం కలిగినప్పుడు రెండో వారు తక్షణం స్పందించి వారి బాధ్యతలను పూర్తి చేయాలి. అప్పుడు వారి మనసు ఆనందంతో నిండి పోతుంది. ఒక్కోసారి ఆఫీసు లేదా కుటుంబ సమస్యలు  చుట్టుముడుతుంటాయి. భాగస్వామి వాటి గురించి చెప్పక పోయినా వారి కదలికలను బట్టి తెలుసుకో గలగాలి. సమస్య ఏంటంటూ మృదువుగా అడిగి పరిష్కరించుకోవడానికి సాయపడాలి. నీవల్లే జరిగి ఉంటుంది. ఇందులోంచి బయటపడలేవు అని విమర్శలు మొదలుపెడితే భవిష్యత్తులో మరేదైనా ఇబ్బంది, కష్టం వచ్చినప్పుడు పెదవి విప్పరు. అందుకే కాస్త సాయం అందిస్తే చాలు. అవతలి వారి మనసు ఆనందపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్