చిన్నారి కోపాన్ని తగ్గించండిలా!

మీ చిన్నారికి కోపం కాస్త ఎక్కువ ఉంటే ఇప్పటి నుంచే ఆ భావోద్వేగాన్ని అదుపు చేసేందుకు మీ వంతుగా ప్రయత్నించండి. అందుకోసం ఈ చిట్కాలు ఓసారి చూడండి.

Published : 05 Apr 2022 01:24 IST

మీ చిన్నారికి కోపం కాస్త ఎక్కువ ఉంటే ఇప్పటి నుంచే ఆ భావోద్వేగాన్ని అదుపు చేసేందుకు మీ వంతుగా ప్రయత్నించండి. అందుకోసం ఈ చిట్కాలు ఓసారి చూడండి.

ఓపిక అవసరం... కోపంగా ఉన్న చిన్నారితో ఓపికగా ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అల్లరిని భరిస్తూ సమయం దొరికినప్పుడల్లా వారు చేస్తున్న మొండి పనులు, వాటి వల్ల కలిగే ఇబ్బందులను మృదువుగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఇది కొంత కాలం కొనసాగితే మార్పు మెల్లిగా మొదలవుతుంది. మీ చిన్నారి కోపానికి కారణం ఏంటో కనుక్కోవాలి. అప్పుడే దాన్ని ఎలా తగ్గించాలో తెలుస్తుంది. భావోద్వేగాలపై అవగాహన...వీటిని అర్థం చేసుకునే వయసు చిన్నారులకు ఉండదు. కాబట్టి పెద్దలే వాటి గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి.

స్పందించాలి... పిల్లలు కోపంగా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంతే తప్ప వారిపై కోపం ప్రదర్శించొద్దు. ఇలా చేస్తే ఏం జరిగిందో చెప్పరు.  

మోడల్‌ మీరే.. చిన్నారి సంతోషంగా, శాంతంగా ఉండాలంటే... వాటన్నింటినీ ముందు మీరు పాటించాలి. మీరు ఇతరులతో నడుచుకునే విధానాన్నే తనూ మిమ్మల్ని చూసి నేర్చుకుంటుంది. కోపంగా ఉంటే అమ్మ ఏం అడిగినా చేస్తుంది అని చిన్నారి అనుకునేలా మీ ప్రవర్తన ఉండొద్దు. ఇది వారి భవిష్యత్తుకు మంచిది కాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్