అమ్మలూ...అబ్బాయిలకివి నేర్పండి!

ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఉంటే ఇద్దరు పిల్లలకూ ప్రేమాభిమానాలే కాదు... హక్కులు, బాధ్యతలు, పనులనూ సమానంగా పంచండి.

Updated : 08 Apr 2022 06:36 IST

ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఉంటే ఇద్దరు పిల్లలకూ ప్రేమాభిమానాలే కాదు... హక్కులు, బాధ్యతలు, పనులనూ సమానంగా పంచండి.

* వంట, అంట్లు తోమడం... ఆడవారు చేసే పనులే అని ఇప్పటికీ చాలామంది దురభిప్రాయం. వంటిల్లు ఆడవారి సామ్రాజ్యం అంటూ అమ్మాయిలే వంటపని, ఇంటి పనులు నేర్చుకోవాలని అనుకోవద్దు. అది అబ్బాయిలకూ వర్తిస్తుంది. చిన్నప్పటి నుంచి వారికీ కూరగాయలు కడగడం, పాత్రలు సర్దడం లాంటి చిన్న చిన్న పనులు నేర్పండి. ఏయే వంట పాత్రలను దేని కోసం వాడతారో వివరించండి. భోజనాల బల్ల దగ్గర కూర్చొనే విధానం నుంచి తినే పద్ధతులు, తిన్నాక పాత్రలు శుభ్రం చేసుకోవడం దాకా మెల్లిగా అన్నీ అలవాటు చేయండి. ఇంట్లో అన్ని పనులూ ప్రతి ఒక్కరికీ రావాలి. రాకపోతే నేర్చుకోవాలి. అందుకే మీరే దగ్గరుండి వాటిని నేర్పించండి.
* రోజూ స్నానం చేయడం, చేతిగోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం లాంటివి నేర్పాలి. శుభ్రతే ఆరోగ్యాన్నిస్తుందని చెప్పాలి.
* ఆడ, మగ సమానమే అన్న విషయాన్ని చిన్నప్పటి నుంచే వారికి తెలపాలి. మహిళల పట్ల వివక్ష చూపకూడదని చెప్పాలి. అది ఇంటి నుంచే పాటిస్తే వారికి చక్కటి ఉదాహరణ దొరికినట్లే. భావోద్వేగాలకు స్త్రీ, పురుష బేధం ఉండదు. అయితే ఏ సందర్భంలోనైనా అబ్బాయిలు ఏడిస్తే... కుటుంబ సభ్యులు ‘ఆడపిల్లలా ఆ ఏడుపేంటి? ఆపు’ అంటూ మందలిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు కన్నీళ్లుగా బయటకు రావడం సహజమే. మీ బాబు బాధపడితే ఏడ్వనివ్వండి. అది కేవలం అమ్మాయిలకు మాత్రమే అన్న ఆలోచన మీలోంచి తొలగించుకోండి. వారికీ కలిగించకండి. ఇది తప్పని మీ చిన్నారికి చిన్నప్పటి నుంచే చెప్పండి.
* మీ అబ్బాయికి చిన్నప్పటి నుంచే ఇతరుల పట్ల జాలి, కరుణ చూపడం నేర్పండి. మాటకు చాలా శక్తి ఉంటుంది. ఏదైనా దాన్ని ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడాలని, పరుషమైన పదాలతో  ఎదుటి వారిని బాధపెట్టొద్దని చెప్పండి. కష్ట సమయాల్లో సహనంగా ఉండేలా తర్ఫీదు ఇవ్వండి.
చుట్టూ ఉండే మనుషులతో కలిసి పోయేలా తనని తయారు చేయాలి. లేదంటే ఒంటరై పోతాడు.
* తన తప్పులను తెలుసుకుని మరోసారి చేయకుండా జాగ్రత్త పడమనండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్