పిల్లల పెంపకం సులువుగా...

ఉద్యోగినులకు పిల్లల పెంపకం మరింత కష్టమైన బాధ్యత. అలాగని ఉద్యోగాన్ని వదులుకోలేం. పిల్లల పనులూ ఉద్యోగ బాధ్యతలతో ఒత్తిడి పెరిగే మాట నిజం. అయినా..

Updated : 21 Apr 2022 06:06 IST

ఉద్యోగినులకు పిల్లల పెంపకం మరింత కష్టమైన బాధ్యత. అలాగని ఉద్యోగాన్ని వదులుకోలేం. పిల్లల పనులూ ఉద్యోగ బాధ్యతలతో ఒత్తిడి పెరిగే మాట నిజం. అయినా... ఆందోళన పడకుండా రెండింటినీ చక్కబెట్టుకునేందుకు ఈ సూత్రాలు పాటించి చూడండి.
* పిల్లల కోసం పూర్తి సమయం కేటాయించలేకపోతున్నాను అని చాలామంది బాధ పడుతుంటారు. మీరు సరదా కోసం కాదు, కుటుంబం కోసమే కదా ఉద్యోగం చేస్తున్నది. అందువల్ల అపరాధభావం వద్దు. సాధ్యమైనంత ఎక్కువసేపు పిల్లల కోసమే కేటాయిస్తున్నాను అనుకుని సంతోషంగా ఉండండి. ఇది మీకు ఊరటనిస్తుంది, ఒత్తిడి ఉండదు.
* చేయాల్సిన పనులను క్యాలెండర్‌లో పొందుపరిచి భోజనాల బల్ల దగ్గర తగిలించండి. మర్చిపోకుండా వేళకు పనులు చేసుకోడానికి ఇది తోడ్పడుతుంది.
* ఉదయం హడావుడి కనుక కూరగాయలు తరిగి ఉంచడం, వేసుకోవాల్సిన దుస్తులు సిద్ధచేసుకోవడం లాంటివి రాత్రే పూర్తి చేయండి. పని కొంత సులువవుతుంది.
* మీ చిన్నారిని బేబీ కేర్‌ సెంటర్‌లో చేర్చే ముందే అక్కడ పిల్లల్ని బాగా చూసుకునేదీ లేనిదీ విచారించండి. అప్పుడే మీరు ఆఫీసులో నిశ్చింతగా ఉండగలరు.
* సహోద్యోగులు, పై అధికారులతో మీ పిల్లలు, కుటుంబ బాధ్యతల గురించి చెప్పండి. అత్యవసర సందర్భాల్లో సెలవు పెడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఒత్తిడి కొంతవరకూ తగ్గుతుంది.
* అప్పుడప్పుడూ బంధుమిత్రులతో మాట్లాడుతూ ఉండండి. దీనివల్ల అనేక అంశాల్లో మెలకువలు తెలుస్తాయి. అంతకు మించి అంతర్లీనంగా ఉన్న అలజడులు మాయమై ఉల్లాసం సొంతమవుతుంది.
ఇంటి గురించి ఆఫీసులో, ఆఫీసు గురించి ఇంట్లో ఆందోళన చెందొద్దు. ఎక్కడ ఉన్నప్పుడు అక్కడి పనులు అంకిత భావంతో చేస్తే సరిపోతుంది. లేదంటే రెండూ సంక్లిష్టమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్