బెదిరిస్తున్నారేమో చూడండి..

రాగిణికి తన 12 ఏళ్ల కూతురి ప్రవర్తన అర్థం కావడం లేదు. స్కూల్‌ నుంచి చికాకుగా వచ్చి గదిలోకి వెళ్లి, ఒంటరిగా ఉంటోంది. తన బాధేంటో చెప్పదు. పిల్లలు ఇలా చేస్తుంటే ఎవరైనా బెదిరిస్తున్నారేమో! తక్షణం గుర్తించకపోతే ప్రమాదం ముంచుకొస్తుందంటున్నారు నిపుణులు.

Updated : 09 Sep 2022 11:54 IST

రాగిణికి తన 12 ఏళ్ల కూతురి ప్రవర్తన అర్థం కావడం లేదు. స్కూల్‌ నుంచి చికాకుగా వచ్చి గదిలోకి వెళ్లి, ఒంటరిగా ఉంటోంది. తన బాధేంటో చెప్పదు. పిల్లలు ఇలా చేస్తుంటే ఎవరైనా బెదిరిస్తున్నారేమో! తక్షణం గుర్తించకపోతే ప్రమాదం ముంచుకొస్తుందంటున్నారు నిపుణులు.

పిల్లల్లో అకస్మాత్తుగా మార్పు వచ్చిందంటే అందుకు కారణాల్లో బెదిరింపులు కూడా ఉండొచ్చు. దాడి చేయడం, మాటలతో హింసించడం, బెదిరించడం, బ్లాక్‌మెయిలింగ్‌... ఇలా ఏదైనా అవ్వొచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా బెదిరిస్తూ ఉండొచ్చు. ఇది పిల్లల్లో భయంగా మొదలై, న్యూనతకు దారి తీస్తుంది. ఒంటరిగా గడపడం, ప్రతి చిన్న విషయానికీ కోపం, నిమిషానికొకలా ప్రవర్తన, చదువులో వెనకబడటం, ఆహారపు అలవాట్లు మారడం వంటివన్నీ దీనికి సంకేతాలే. తమ సమస్యను దాటలేమనే అపోహలోకి జారిపోయినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు. వాళ్లు మనసు విప్పాలంటే... ముందు సమస్యను పెద్దవాళ్లు గుర్తించాలి.

ఆత్మగౌరవం పెంచేలా... సమస్య వచ్చినప్పుడే కాకుండా... ముందు నుంచి పిల్లల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. క్రీడలు, బృంద చర్చలు వంటి వాటిలో పాల్గొనేలా చేయాలి. గెలిచినప్పుడు ప్రశంసించాలి. అలా వారిలోని శక్తిని బయటకు తీస్తే చాలు. ఇవి వారి గురించి వారు తెలుసుకునేలా చేసి, ఏ సమస్యనైనా అధిగమించే తత్వాన్ని నేర్పుతాయి.

స్నేహితులుగా.. పెద్దవాళ్లు చిన్నారులకు మిత్రుల్లా మెలగాలి. వారి విషయాలను మనసు విప్పి చెప్పగలిగే సాన్నిహిత్యాన్ని కల్పించాలి. ప్రతి అంశాన్నీ వారితో పంచుకుంటే పిల్లలు అమ్మా నాన్నలను ఆప్తులుగా అర్థం చేసుకుంటారు. తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసం, నమ్మకం, భద్రతాభావం పెద్దవాళ్ల నుంచి పిల్లలు పొందగలిగితే చాలు. సమస్యను చెప్పడానికి మొదట్లో వెనుకాడినా తర్వాత ధైర్యం చేస్తారు. వారు చెప్పింది విని నీదే తప్పు అనకుండా, ఆ సమస్యకెదురెళ్లి పోరాడేలా మానసికంగా తయారు చేయగలగాలి. అలా చేస్తే ఆ సందర్భంలోనే కాదు, జీవితంలో ఏ ఆటంకాన్నైనా అధిగమించగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్