ఈ తరహా పెంపకంలో...

చిన్నారులపట్ల అధికార పూర్వకంగా, నిరంకుశంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఈ పద్ధతుల్లో పెంచితే అది పిల్లలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని

Published : 01 May 2022 01:44 IST

చిన్నారులపట్ల అధికార పూర్వకంగా, నిరంకుశంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఈ పద్ధతుల్లో పెంచితే అది పిల్లలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కలిగే విపరిణామాలనూ చెబుతున్నారు.

చిన్నారులపై అధికారాన్ని ప్రదర్శించకూడదు. ఇదే తిను, ఇలాగే చదువు, ఈ దుస్తులనే ధరించు, వీళ్లతోనే స్నేహం చెయ్యాలి అంటూ ప్రతి అంశంలోనూ తమ ఆధిక్యతను ప్రదర్శిస్తే అది పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. తల్లిదండ్రులపట్ల ప్రేమ స్థానంలో భయం మొదలై, తర్వాత నిర్లక్ష్యంగా మారుతుంది. వారికి స్నేహితులుగా మారితే వినడానికి పిల్లలెప్పుడూ సిద్ధంగా ఉంటారు. లేదంటే ఈ పద్ధతి పిల్లల్లో భయాన్ని పెంచుతుంది. దాంతో వారు చిన్న విషయంలోనూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరు. మరికొందరు భయంతో పెద్దలకు నచ్చినట్లుగా ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా కాదు.

నిరంకుశత్వం వద్దు... ఇది తినకపోతే నీకిక భోజనం లేదు, ఈ తరగతిలో పాస్‌ కాకపోతే చదువు మానిపిస్తా... ఇలా బెదిరించడాన్ని క్రమశిక్షణలో పెట్టే పద్ధతి అనుకోకూడదు. ప్రతిదానికీ శిక్షించడం, నిరంకుశ ధోరణి చిన్నారులను వేదనకు గురి చేస్తాయి. ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు ఇంట్లో ఒకలా, బయట మరొకలా చేస్తుంటారు. స్నేహితుల ప్రభావానికి త్వరగా లోనవుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. పిల్లలకు స్వేచ్ఛనిస్తూనే ప్రేమగా, మృదువుగా చెప్పాలి. వారికిష్టమైన నిర్ణయాన్ని తీసుకోనిస్తూనే, లాభనష్టాలను విడమరిచి చెప్పాలి.

నిర్లక్ష్యం వద్దు... పిల్లలు తమ సమస్యలు చెబుతుంటే కొందరు పెద్దలు వినరు. నీదే తప్పు, స్నేహితులతోనే నీకు ఇబ్బందులొస్తున్నాయి అంటూ వాళ్లు చెబుతున్న సమస్యలపై దృష్టి పెట్టరు. కొందరైతే మంచి స్కూల్‌లో వేశాం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని, సౌకర్యాలను ఇస్తున్నాం చాలనుకుంటారు. వీటితోపాటు అమ్మానాన్నల ప్రేమ, సంరక్షణ కూడా అత్యంత ముఖ్యం. వారికి నచ్చిన రంగాల్లోకి వెళ్లేలా,  అందులో విజయాలను సాధించేలా పెద్దవాళ్లు ప్రోత్సాహాన్ని అందిస్తే పిల్లలు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్