స్నేహితుల్లా ఉండాలి!

ఉన్నతమైన వ్యక్తిత్వం, నైతిక విలువలున్న వ్యక్తి భాగస్వామిగా రావాలని అందరూ కోరుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎదుటి వారిలో మనం అనుకున్న సుగుణాలు లేకపోతే... వారి అలవాట్లు మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఏం చేయాలి? 

Published : 04 May 2022 01:20 IST

ఉన్నతమైన వ్యక్తిత్వం, నైతిక విలువలున్న వ్యక్తి భాగస్వామిగా రావాలని అందరూ కోరుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎదుటి వారిలో మనం అనుకున్న సుగుణాలు లేకపోతే... వారి అలవాట్లు మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఏం చేయాలి? 

అందరికీ మంచి వ్యక్తిత్వం ఉన్న భాగస్వామి దొరకాలని లేదు. ప్రతి ఒక్కరిలో మంచి, చెడులుంటాయి. కాబట్టి ఎదుటి వారిలోని మంచిని గుర్తుంచుకుని చెడును మరిచిపోండి. అంటే భాగస్వామి ప్రతి అలవాటుకూ సర్దుకుపొమ్మని కాదు. 

ఆలోచనలను మార్చండి.. రోజూ తనతో కాసేపు గడపండి. మహిళల పట్ల తనకున్న అభిప్రాయం, ఆలోచనలు క్రమంగా మీకు అర్థమవుతాయి. ఒకవేళ అతనిది కాస్త సంకుచిత మనస్తత్వం అయితే... మెల్లి మెల్లిగా మార్చడానికి ప్రయత్నించండి. 

తన మాటే వినాలని.. వివాహ బంధం బలంగా ఉండాలంటే ఆలుమగల మధ్య ఒకరిపై మరొకరికి ప్రేమ, స్వేచ్ఛ ఉండాల్సిందే. ఇద్దరూ స్నేహితుల్లా కలిసి మెలగాలి. 

బిజీ బిజీ అంటుంటే.. ఈ రోజుల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరిగిపోయింది. చాలామందికి తీరిక ఉండటం లేదు. అయితే ప్రతి సందర్భంలో తను క్షణం తీరిక లేకుండా ఉన్నట్లు, మీతో పెద్దగా మాట్లాడకుండా ఉంటే కొన్నాళ్లు గమనించండి. కారణం ఏంటో నేరుగా అడిగి తెలుసుకోండి. నిజంగానే మితభాషి అయితే మీరే మాట కలపండి. పని ఒత్తిడి అయితే అర్థం చేసుకుని తోచిన సలహాలు చెప్పండి. ఇద్దరూ కలసి గడపాలి అనిపించేలా చేయాలి. మీరు గృహిణి అయితే ఏదో ఒక వ్యాపకం పెట్టుకోండి. ఖాళీగా ఉండటం వల్ల కూడా ఆలోచనలన్నీ తన చుట్టే తిరుగుతాయి.

ప్రాధాన్యం ఇవ్వట్లేదా.. సమాన హక్కులే కాదు.. బాధ్యతలు ఉన్నప్పుడే ఆ బంధం దృఢంగా ఉంటుంది. ఎదుటివారు చెప్పేది మనం విన్నప్పుడు... మనమేం చెబుతున్నామో వారూ వినాలి. సమ ప్రాధాన్యం పాటించాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఇద్దరూ చర్చించుకోవాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్