అమ్మకి ఏమిద్దాం?

ఆరోగ్యం బాగోలేకపోయినా.. బాధ కలిగినా మొదట గుర్తొచ్చేది అమ్మే! తన చిన్న స్పర్శ మనకెంత భరోసా. మనకీ అమ్మంటే ప్రేమే! మనసులో ఎంతున్నా మాటలు, చేతల్లో చెప్పాలి కదా? రేపే మాతృదినోత్సవం. మరి మీరేం చేస్తున్నారు?!

Published : 07 May 2022 00:33 IST

ఆరోగ్యం బాగోలేకపోయినా.. బాధ కలిగినా మొదట గుర్తొచ్చేది అమ్మే! తన చిన్న స్పర్శ మనకెంత భరోసా. మనకీ అమ్మంటే ప్రేమే! మనసులో ఎంతున్నా మాటలు, చేతల్లో చెప్పాలి కదా? రేపే మాతృదినోత్సవం. మరి మీరేం చేస్తున్నారు?!

* కళలంటే ఇష్టమనుకోండి. మీ సృజనాత్మకతకు పని చెప్పేయండి. కష్టమని కంగారు పడకండి. సెంటెడ్‌ క్యాండిల్స్‌కి రంగుల కాగితాలు, జరీ, పూసలు రాళ్లతో కొంత మ్యాజిక్‌ చేసేయండి. రోజంతా పనితో అలసిన తనకు ఆ సువాసనలు కొత్త ఉత్తేజాన్ని, విశ్రాంతినిస్తాయి. యూట్యూబ్‌ సాయంతో ఐస్‌క్రీమ్‌ పుల్లలు.. రంగు కాగితాలతో అలంకరణ వస్తువును చేయండి. చూసి ఎంతలా మురిసిపోతుందో మీరే గమనిస్తారు. నచ్చితే చేనేత చీరలైనా కొనివ్వొచ్చు.
* ఎప్పుడూ అమ్మ చేసింది తిని ఆహా అనుకోడమేనా? మీరూ గరిటె తిప్పేయండి. ఆమె నేర్పిందే అయినా.. మీ చేతి వంట ఆమెకీ అమృతమే. ఈ మాట తన నోటే వింటారు కావాలంటే ప్రయత్నించండి.
* సంగీతమంటే ఇష్టమా? ఓ మంచి పాట పాడేయండి. మీ గొంతెలా ఉన్నా.. ఆమె ఆనందించడం మాత్రం ఖాయం. తనకు నచ్చినవన్నింటినీ డౌన్‌లోడ్‌ చేసివ్వడం లాంటివి చేసివ్వండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువా! సేంద్రియ ఉత్పత్తులు కొనివ్వండి. కూరగాయలు, పండ్లైనా సరే ఆమె మనసు దోచేస్తాయి.
ఇంటికొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాటు చేయండి. యాప్‌, ఫోన్‌ కాల్‌ దూరమే!
* మనకు చిన్న దెబ్బ తగిలినా తను తట్టుకోలేదు.. ముఖంలో చిన్న మార్పునీ ఇట్టే పట్టేస్తుంది. కానీ తన విషయానికొచ్చేసరికే అన్నింటినీ అశ్రద్ధ చేస్తుంది. కాళ్లకు పగుళ్లు కనిపించాయా.. చర్మం వడలినట్లు కనిపిస్తోందా.. అన్నింటికీ క్రీములు తీసుకోండి. గతంలో చెప్పినా విని ఊరుకొని ఉంటారేమో! స్వయంగా తెచ్చిచ్చారనుకో.. గుర్తుంచుకొని మరీ తప్పక వాడుతుంది.
* ఆమె మీకెంత స్ఫూర్తో.. మీకెలా ధైర్యాన్నిస్తుందో.. తన నుంచి ఏం నేర్చుకున్నారో.. అక్షర రూపం ఇచ్చేయండి. వాటిల్లో తనపై తాను చూపే అశ్రద్ధ మిమ్మల్ని ఎలా బాధిస్తుందో చేర్చేయండి. మీకోసమైనా తన గురించి తాను ఆలోచించుకుంటుంది. మీకు తనంటే ప్రేమని ఆమెకీ తెలుసు. కానీ ఎంత ప్రేమో మీరే చెప్పాలి. మరి..
ఎలా చెప్పాలనుకుంటున్నారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్