విశ్వమంత ప్రేమ

తేనె - తీపి, జాబిలి - వెన్నెల, పువ్వు - పరిమళం... వీటిని విడదీసి చూడలేం. సృష్టిలో తల్లీబిడ్డల బంధమూ అలాంటిదే. భౌతికంగా వేర్వేరుగా ఉన్నా... తల్లి కావడంతోనే తన ప్రాణాల్ని బిడ్డల్లో దాచేస్తుంది. బిడ్డల ఎదుగుదలలో కనిపించని శ్రమ అమ్మ. పిల్లలకు దక్కే కీర్తిప్రతిష్ఠలే తానందుకున్న సన్మాన సత్కారాలుగా భావిస్తుంది. ఏ తపస్సూ చేయకుండా ఈ సృష్టి ప్రతి జీవికీ ఇచ్చిన వరం అమ్మ. మాతృదినోత్సవం సందర్భంగా కొందరు అసాధారణ అమ్మల స్ఫూర్తిగాథలు...

Updated : 08 May 2022 06:58 IST

మన పండగ... ఇక్కడిలా!

తేనె - తీపి, జాబిలి - వెన్నెల, పువ్వు - పరిమళం... వీటిని విడదీసి చూడలేం. సృష్టిలో తల్లీబిడ్డల బంధమూ అలాంటిదే. భౌతికంగా వేర్వేరుగా ఉన్నా... తల్లి కావడంతోనే తన ప్రాణాల్ని బిడ్డల్లో దాచేస్తుంది. బిడ్డల ఎదుగుదలలో కనిపించని శ్రమ అమ్మ. పిల్లలకు దక్కే కీర్తిప్రతిష్ఠలే తానందుకున్న సన్మాన సత్కారాలుగా భావిస్తుంది. ఏ తపస్సూ చేయకుండా ఈ సృష్టి ప్రతి జీవికీ ఇచ్చిన వరం అమ్మ. మాతృదినోత్సవం సందర్భంగా కొందరు అసాధారణ అమ్మల స్ఫూర్తిగాథలు...

అమ్మ ప్రేమకు కొలమానం లేదు. అంతటి ప్రేమమూర్తికి గౌరవాన్ని అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని పండగలా చేసుకుంటారు. విశ్వమంతా కలిసి మాతృమూర్తికి చేసే పాదాభివందనం ఒక్కటే అయినా... ఈ సంతోషాన్ని వ్యక్తీకరించడంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయాలు, పద్ధతులు ఇవీ...

* తూర్పు ఆఫ్రికా దేశం మలావిలో అక్టోబరు 15న మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ దేశాధ్యక్షుడు ప్రసంగిస్తారు. ప్రపంచ గ్రామీణ మహిళాదినోత్సవం రోజునే మాతృదినోత్సవాన్ని కలిపి జరుపుకొంటారు. ఆ రోజు ఇక్కడ జాతీయ సెలవు దినంగా ప్రకటించడం విశేషం.
* జపాన్‌లో మార్చి 6న ఆ దేశపు పట్టపురాణి కోజున్‌ పుట్టినరోజున నాడే మాతృదినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. తర్వాత 1949 నుంచి మే 8న నిర్వహిస్తున్నారు. ఆ రోజున అక్కడ బాగా ప్రసిద్ధి చెందిన ఎర్రటి పూలను తల్లికి కానుకగా ఇవ్వడం ఆనవాయితీ.
* థాయ్‌లాండ్‌లో అమ్మ ప్రేమ స్వచ్ఛతను ప్రతిఫలించేలా మల్లెలతో చేసిన కానుకలను అమ్మకు అందిస్తారు. ఇక్కడ ఆగస్టు12న మాతృదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొంటారు.
* ఇథియోపియాలో ఏటా ఈ తేదీ మారుతుంటుంది. ఈ ఏడాది మే 8 నుంచి మూడు రోజులు నృత్యం, సంగీతం మధ్య పండగలా జరుపుకోనున్నారు.
* మెక్సికోలో మే 10న మాతృదినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అమ్మను పాటలతో ఉదయం నిద్ర లేపుతారు. ఆమెకిష్టమైన వంటకాలను వండి ప్రేమగా వడ్డిస్తారు. బయటకు తీసుకెళ్లి ఆమెకు నచ్చినవి కొనిస్తారు. ఏడాదిలో హోటళ్లు, రెస్టారెంటుల్లో ఈ రోజున్నంత రద్దీ మరెప్పుడూ ఉండదు.
* నార్వేలో ఫిబ్రవరి 13న జరిపితే, అరబ్‌ దేశాల్లో మార్చి 21న నిర్వహిస్తారు. పోలండ్‌లో మే 26న చేస్తారు. అమెరికా, కెనడా వంటి దేశాల్లో మే 8న మాతృదినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటారు. ఈ రోజు ఇక్కడ సెలవుదినం కావడం విశేషం. చైనాలో పేద మహిళలకు అంకితం చేసి, వారికి చేయూతనందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్