మనకు మంచి... వాళ్లకు చెడా?

రమ్యకు ఎనిమిదేళ్లు. తనని ఫోన్‌లో ఆడుకోనివ్వరు అమ్మానాన్న. వాళ్లు మాత్రం సమయం ఉన్నప్పుడల్లా ఆడటం ఆ చిన్నారికి నచ్చదు. ఇలా పిల్లల్ని వద్దన్న పనిని పెద్దలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదంటున్నారు నిపుణులు. లేదంటే అన్నింటికీ తల్లిదండ్రులను అనుకరించే పిల్లలు ఆ అంశానికే ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Published : 12 May 2022 00:47 IST

రమ్యకు ఎనిమిదేళ్లు. తనని ఫోన్‌లో ఆడుకోనివ్వరు అమ్మానాన్న. వాళ్లు మాత్రం సమయం ఉన్నప్పుడల్లా ఆడటం ఆ చిన్నారికి నచ్చదు. ఇలా పిల్లల్ని వద్దన్న పనిని పెద్దలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదంటున్నారు నిపుణులు. లేదంటే అన్నింటికీ తల్లిదండ్రులను అనుకరించే పిల్లలు ఆ అంశానికే ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

టీవీ ముందు గంటలతరబడి కూర్చునే అమ్మను చూసి పిల్లలూ అదే అలవాటు చేసుకుంటారు. మనం గేమ్స్‌ ఆడుతూ.. చిన్నారులకు మాత్రం అభ్యంతరం చెబితే వాళ్లకు అటువైపే దృష్టి వెళుతుంది. మీరు టీవీ చూస్తూ, గేమ్స్‌ ఆడుతూ, మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారనే కోపం వారి మనసులో మొదలవుతుంది. అది వారిలో పెద్దల పట్ల వ్యతిరేకతను పెంచుతుంది. ఏది చెప్పినా వినని స్థాయికెదుగుతారు. భయం చెప్పాలని చూసినా లెక్కచేయరు. పెద్దల పట్ల నిర్లక్ష్య ధోరణి, అగౌరవం పెరుగుతాయి. అలాకాకుండా వారికేది మంచి విషయమని చెబుతున్నారో దాన్ని ముందుగా పెద్దవాళ్లు పాటించాలి. అప్పుడే చిన్నవాళ్లు అనుకరించడం మొదలుపెడతారు. తల్లిదండ్రుల పట్ల గౌరవభావంతో ఉంటారు.

చెడ్డగా.. స్నేహితుల గురించి ఏదైనా పిల్లలు చెప్పేటప్పుడు అలా ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడకూడదు అని చెబుతుంటారు తల్లిదండ్రులు. తిరిగి వారే ఇతరుల గురించి పిల్లలెదుట తక్కువగా చేసి మాట్లాడుతూ విమర్శిస్తుంటారు. అది చిన్నారులపై చెడు ప్రభావం పడేలా చేస్తుంది. అమ్మా నాన్నలపై గౌరవం తగ్గుతుంది. వారి మనసులో పెద్దవాళ్ల స్థానం దిగజారుతుంది. తమకు మంచి అని చెబుతూ.. దాన్ని వారు పాటించకుండా ఉండటం చిన్నారులను బాధిస్తుంది.

ఆహారం.. తాము ఐస్‌క్రీం తింటూ, ఐస్‌ వాటర్‌ తాగుతూ పిల్లలకు మాత్రం అవి ఆరోగ్యానికి మంచివి కావంటారు. ఇలాంటివి చిన్నారులపై ఎంతోకొంత ప్రభావం చూపుతాయి. తమను దూరంగా ఉంచి, పెద్ద వాళ్లు మాత్రం వాటిని ఎందుకు తీసుకుంటున్నారో అని పిల్లలు ఆలోచిస్తారు. ఆ రుచిని తాము కూడా చూడాలనే ఆసక్తి పెంచుకుంటారు. నష్టం అందరికీ ఒకటే అని అర్థమైతే, పిల్లలు కూడా దాని జోలికి పోరు. ఇది అన్ని విషయాలకూ వర్తిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్