బుజ్జాయి నిద్ర కలత లేకుండా..

బోసినవ్వుల బుజ్జాయికి కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటుంది. అందుకే పాపాయికి పక్క మెత్తగానే కాదు, సౌకర్యవంతంగానూ ఉండాలంటున్నారు నిపుణులు. ఇందుకు పరుపును ఎలా ఎంపిక చేయాలో సూచిస్తున్నారు. మూడునాలుగు నెలల వరకు పక్కపైనే ఎక్కువ సేపు చిన్నారులు నిద్రలో గడుపుతుంటారు.

Published : 25 May 2022 01:38 IST

బోసినవ్వుల బుజ్జాయికి కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటుంది. అందుకే పాపాయికి పక్క మెత్తగానే కాదు, సౌకర్యవంతంగానూ ఉండాలంటున్నారు నిపుణులు. ఇందుకు పరుపును ఎలా ఎంపిక చేయాలో సూచిస్తున్నారు.

మూడునాలుగు నెలల వరకు పక్కపైనే ఎక్కువ సేపు చిన్నారులు నిద్రలో గడుపుతుంటారు. అటువంటప్పుడు దానికి మరింత ప్రాముఖ్యతనివ్వాలి. పరుపు అనారోగ్యాన్ని కలిగించేలా ఉండకూడదు. లేదంటే ఆ చిన్నారి నిద్రలేమితో తల్లికీ అనారోగ్యాలే. ఇందుకోసం వాతావరణానికి తగినట్లు బుజ్జాయికి వెచ్చదనం లేదా చల్లదనాన్ని అందించేలా పరుపు ఉండాలి. కొబ్బరిపీచుతో తయారయ్యే పరుపు వేడిని గ్రహిస్తుంది.

నీటిని..
పరుపు వాటర్‌ప్రూఫ్‌గా ఉండాలి. నీటిని పీల్చకుండా ఉంటేనే తడి, చెమ్మ లోపలికి చేరవు. పరుపు తడిని పీల్చుకుంటే, దాంట్లోంచి ఉత్పత్తి అయ్యే బ్యాక్టీరియాలు అనారోగ్యాలకు కారణమవుతాయి. వాటర్‌ప్రూఫ్‌వి శుభ్రం చేయడం కూడా తేలిక.

సహజసిద్ధంగా..
ఎకో ఫ్రెండ్లీగా తయారవుతున్న పరుపు పాపాయికి మరింత ఆరోగ్యాన్ని అందిస్తుంది. మెత్తని బూరుగుదూది వంటివాటితో తయారయ్యే పరుపు పాపాయికి ఎక్కువ సమయం వేడి ఉత్పత్తి అవకుండా చేసి కావాల్సిన మెత్తదనాన్ని అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్