పరస్పరం గౌరవించుకోవాలి..

దాంపత్యంలో ఎంత ప్రేమ ఉన్నా... ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోకపోతే ఆ బంధంలో మనస్పర్థలకు ఆస్కారం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాదు, భార్యాభర్తలు పరస్పరం తమ మధ్య బంధాన్ని కూడా గౌరవిస్తేనే ఆ అనుబంధం శాశ్వతంగా నిలుస్తుందని సూచిస్తున్నారు.

Published : 04 Jun 2022 01:09 IST

దాంపత్యంలో ఎంత ప్రేమ ఉన్నా... ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోకపోతే ఆ బంధంలో మనస్పర్థలకు ఆస్కారం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాదు, భార్యాభర్తలు పరస్పరం తమ మధ్య బంధాన్ని కూడా గౌరవిస్తేనే ఆ అనుబంధం శాశ్వతంగా నిలుస్తుందని సూచిస్తున్నారు.

దంపతుల మధ్య ప్రేమకు అంతు ఉండకూడదు. అయితే ఎదుటివారు ఆ ప్రేమను స్వీకరిస్తున్నారా లేదా గుర్తించాలి. మీ ప్రేమను వారు గౌరవించి తిరిగి ప్రేమిస్తున్నారా చూడాలి. అటువంటి భావం అవతలివారిలో కనిపించనప్పుడు మీ ప్రేమ విలువను వారికి తెలియజేయాలి. లేదంటే మీ ప్రేమకున్న గౌరవాన్ని మీరు కోల్పోయినట్లే. భాగస్వామికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేనున్నానే భరోసా మీరు చూపించడంద్వారా మీ ప్రేమ వారికి అర్థమయ్యేలా చేయొచ్చు.

సరిహద్దులు.. వైవాహికబంధంలోనూ పాటించాల్సిన సరిహద్దులు కొన్ని ఉంటాయి. ఎదుటివారి బాధ్యతలు, అవసరాలను గుర్తించి తగినట్లుగా నడుచుకోవాలి. మీరు షాపింగ్‌ లేదా మరెక్కడికైనా వెళ్లాల్సినప్పుడు అవతలివారికి అదే సమయంలో మరొక ముఖ్యమైన పని ఉండి ఉంటుంది. మీతోపాటు వారు కూడా రావాలని వాదిస్తూ, పూర్తిగా వారి వ్యక్తిగత బాధ్యతల్లో తలదూర్చడం మంచిది కాదు. ఎదుటివారికీ వారి విషయాల్లో కొన్ని హద్దులుంటాయని గుర్తించి వాటినీ.. గౌరవించాలి.

మిమ్మల్ని మీరు.. ఎటువంటి సందర్భంలోనూ ఆత్మగౌరవాన్ని వీడకూడదు. ఇదే అవతలివారికి మీపై మరింత ప్రేమ, గౌరవ మర్యాదలను పెంచుతుంది. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలగాలి. అప్పుడే మీరంటే మీకు గౌరవం ఏర్పడుతుంది. ఆ తర్వాతే ఎదుటివారిని ప్రేమించాలి. మీ బలం, బలహీనతలనూ తెలుసుకోగలిగితేనే వైవాహికబంధంలో ఎదురయ్యే సమస్యలను తేలికగా పరిష్కరించుకోగలుగుతారు. లేదంటే ఎదుటివారికి మీరొక సమస్యగా మారే ప్రమాదం ఉంది. అది మీ బంధాన్ని బలహీనపరుస్తుంది.

అంగీకరించి.. మీ లోపాలను మీరు అంగీకరించగలిగితేనే ఎదుటివారిలో కనిపించే తప్పొప్పులు అర్థమవుతాయి. అలాకాకుండా అవతలివారిలో తప్పులను మాత్రమే ఎత్తిచూపిస్తూ, మనలో ఎటువంటి లోపాలు లేవనుకుంటే పొరపాటు. ప్రతి ఒక్కరిలోనూ బలహీనతలుంటాయి. వాటిని పరస్పరం అంగీకరించాలి. అప్పుడే ఎటువంటి సమస్యల్లేకుండా సంసారాన్ని సంతోషంగా సాగించొచ్చు. అలాగే అవతలివారు మీకు విలువనివ్వకుండా ప్రవర్తిస్తుంటే ఖండించకుండా ఉండకూడదు. మీ విలువను తెలియజేయడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్