సంతోషంతో వేడుక చేసుకోండి...

కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మీద మనకెంతో ప్రేమ, నమ్మకం ఉంటాయి.. ఇక జీవిత భాగస్వామి గురించి చెప్పాల్సిందే లేదు. ఆ అచంచల ప్రేమ అనేక విషయాలకు అతని మీద ఆధారపడేలా చేస్తుంది. కానీ అంతగా వాలిపోవద్దు, మీపట్ల మీకు ధైర్యం, నమ్మకం ఉండటం చాలా

Updated : 15 Jun 2022 04:01 IST

కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మీద మనకెంతో ప్రేమ, నమ్మకం ఉంటాయి.. ఇక జీవిత భాగస్వామి గురించి చెప్పాల్సిందే లేదు. ఆ అచంచల ప్రేమ అనేక విషయాలకు అతని మీద ఆధారపడేలా చేస్తుంది. కానీ అంతగా వాలిపోవద్దు, మీపట్ల మీకు ధైర్యం, నమ్మకం ఉండటం చాలా ముఖ్యమని చెబుతున్నారు మానసిక నిపుణులు. అదేంటీ.. అన్నీ మనమే చేసుకోవాలంటే ఎలా కుదుర్తుందీ, కొన్నిటికైనా ఆధారపడకుంటే ఎలా అనుకుంటూ దీర్ఘాలోచనలో పడిపోయారా? అయితే అసలు సంగతేంటో చదివేయండి...

* ప్రతిదానికీ భర్త మీద ఆధారపడుతుంటే పిల్లలకు మీ మీద గౌరవం తగ్గకపోవచ్చు కానీ నమ్మకం అయితే కలగదు. ‘అమ్మకేమీ తెలీదు, ఆమెని ఆడగటం వృథా’ అనే భావం బలపడుతుంది. బయటి పనుల గురించి మీకూ అవగాహన ఉంటే మీలో ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. మరెన్నో నేర్చుకోగలను, సమర్థించుకోగలను అనే నమ్మకం పెరుగుతుంది.

* కలిసి జీవిస్తున్నప్పుడు పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా కుదరదు. ఎవరి పనులు వాళ్లు చేస్తూ కొన్ని కొన్ని బాధ్యతలు అప్పగించాల్సిందే.. కాకపోతే మరో ఉద్యోగం లేదా పదోన్నతి కోసం అర్జీ రాయడం, ట్రావెల్‌ ఏజెన్సీలో టికెట్లు బుక్‌ చేయడం లాంటి పనులు తెలీదంటూ బొత్తిగా వాటి జోలికి వెళ్లకుండా భర్తను చేసిపెట్టమని ప్రాధేయపడటం సరికాదంటున్నారు నిపుణులు. ఆయా పనులు చేయకపోయినా పరవాలేదు, కానీ తెలిసుంటే ఆత్మవిశ్వాసం తగ్గకుండా ఉంటుంది.

* ‘ఆయనైతే ఆంగ్ల, హిందీ భాషల్లో దిట్ట.. నేనంతగా మాట్లాడలేను’ అని భయపడకండి. ఇది కూడా న్యూనతా భావం కలిగిస్తుంది. ఒక్కరోజులో ఎవ్వరూ ఏ భాషా నేర్చుకోలేరు. అలవాటు చేసుకుంటే అదే వస్తుంది. మొదట్లో తప్పులు దొర్లితే పర్లేదనుకోండి. అదేమీ విమాన చోదనం కాదుగదా.. ప్రమాదం జరిగి అమాంతం పడిపోవడానికి! మహా అయితే ఎదుటివాళ్లు కొంచెం నవ్వుతారు. ఆ మాత్రానికి న్యూనత ఎందుకు? మీ కారణంగా వాళ్లు నవ్వారని సంతోషించి మీరూ శ్రుతి కలపండి.

* మీరేదైనా మంచి పని చేసినప్పుడు కుటుంబసభ్యులు వాళ్లే గుర్తించి ప్రశంసిస్తే సంతోషమే. లేకున్నా కుంగిపోవద్దు. విషయమేంటో మీరే చెప్పండి. పాయసంతోనో పులిహోరతోనో... వాటికి అవకాశం లేదంటే కాఫీతోనో వేడుక చేసుకోండి. అప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆ సంతోషం మరిన్ని పనులకు ప్రేరణ కలిగిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్