ఒంటరిగా ఉంటానంటే ఎలా?

ఒకప్పటిలా కాదు, ఈరోజుల్లో నలుగురిలో కలవలేకపోయినా, పదిమందిలో మాట్లాడలేకపోయినా సమస్యగానే భావించాలి. క్లాస్‌రూమ్‌ భాగస్వామ్యం, నెట్‌వర్కింగ్‌, గ్రూప్‌లు, క్లబ్‌లు, బయటకు వెళ్లడం... ఎక్కడ చూసినా భావవ్యక్తీకరణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే.

Published : 19 Jun 2022 01:16 IST

ఒకప్పటిలా కాదు, ఈరోజుల్లో నలుగురిలో కలవలేకపోయినా, పదిమందిలో మాట్లాడలేకపోయినా సమస్యగానే భావించాలి. క్లాస్‌రూమ్‌ భాగస్వామ్యం, నెట్‌వర్కింగ్‌, గ్రూప్‌లు, క్లబ్‌లు, బయటకు వెళ్లడం... ఎక్కడ చూసినా భావవ్యక్తీకరణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ఇలాంటి వాతావరణంలో అంతర్ముఖులైన పిల్లలు ఇబ్బంది పడతారు. వాళ్లలో ఎలా మార్పు తీసుకురావొచ్చంటే...

* అంతర్ముఖులుగా, మితభాషిగా ఉండటమనేది లోపమేమీ కాదు. తప్పు అంత కంటే కాదు. వీరిలో మార్పు తేవాలనుకుంటే ముందుగా వారి భావాల్నీ, అభిప్రాయాల్నీ వ్యక్తపరిచేలా పిల్లల్ని ప్రోత్సహించండి. నచ్చిన కళలో శిక్షణ, డైరీ రాయడం, సృజనాత్మక రచన.. అలవాటు చేయండి.

* ఎన్ని చెప్పినా మాట్లాడవేంటి అంటూ పోట్లాడకుండా.. క్రమంగా వారిలో మార్పు వచ్చేలా వాతావరణాన్ని సృష్టించండి.

* పిల్లలకు మాట్లాడే అవకాశాల్ని కల్పించాలి. ఆటలకు పంపించడం, పండగలూ, వేడుకల్లో నలుగురిలో కలిసేలా చేస్తే స్నేహం చేయడం మొదలుపెడతారు. క్రమంగా మార్పు వస్తుంది.

* బాగా మాట్లాడటానికి.. బాగా వినడం, పరిశీలించడం కూడా అవసరం. ఆ విధంగా వారిని ప్రోత్సహించండి.

* అంతర్ముఖులుగా ఉండటం ఒక స్వభావం. కొందరికి అది బలం కూడా. కాబట్టి దాన్ని ఒక్కరోజులో మార్చాల్సిన పనిలేదు.

* ఇవన్నీ చేస్తూనే వారి ఒంటరితనానికి భంగం కలిగించవద్దు. సమూహాలు ఉండే చోటుకు వెళ్లాల్సి వస్తే మీరు కాస్త ముందే అక్కడుండేలా ప్లాన్‌ చేసుకోండి.

* అవసరమైనపుడు బ్రేక్‌ తీసుకోనివ్వండి.

* మందలించాల్సి వస్తే నలుగురిలో కాకుండా ఒక్కరే ఉన్నపుడు చేయాలి.

* మాట్లాడేటపుడు వాళ్లకి అడ్డుపడొద్దు. మనసులో మాట పూర్తిగా చెప్పనివ్వండి.

* స్విమ్మింగ్‌, చెస్‌ లాంటి ఆటలు కాకుండా క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌ లాంటి టీమ్‌ స్పోర్ట్స్‌ ఆడేలా ప్రోత్సహించండి.

* విజయాన్ని ఆస్వాదించడం, ఆనందాన్ని పంచుకోవడం గురించి చెప్పండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్