అమిత కోపాన్ని నియంత్రిస్తేనే...

సుమిత్ర ఎనిమిదేళ్ల కూతురికి కోపం వచ్చిందంటే ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురేే. ఎవరేం చెప్పినా వినదు. తోటి పిల్లలతో కలవదు. ఈ అమిత కోపం వెనుక తీవ్రమైన మానసిక సంఘర్షణ ఉండొచ్చంటున్నారు నిపుణులు. చిన్నప్పటి నుంచే కోపాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రుల అమిత గారం పిల్లల్లో మొండితనాన్ని పెంచుతుంది. కోపం చూపిస్తే లేదా ఏడిస్తే అమ్మానాన్నలు కావాల్సింది ఇస్తారని...

Published : 28 Jun 2022 00:18 IST

సుమిత్ర ఎనిమిదేళ్ల కూతురికి కోపం వచ్చిందంటే ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురేే. ఎవరేం చెప్పినా వినదు. తోటి పిల్లలతో కలవదు. ఈ అమిత కోపం వెనుక తీవ్రమైన మానసిక సంఘర్షణ ఉండొచ్చంటున్నారు నిపుణులు. చిన్నప్పటి నుంచే కోపాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు.

ల్లిదండ్రుల అమిత గారం పిల్లల్లో మొండితనాన్ని పెంచుతుంది. కోపం చూపిస్తే లేదా ఏడిస్తే అమ్మానాన్నలు కావాల్సింది ఇస్తారని చిన్నారులు గుర్తిస్తే చాలు, దాన్నే కొనసాగిస్తారు. ప్రేమకి, గారాబానికి తేడాను ముందుగా పెద్దవాళ్లు తెలుసుకోవాలి. పిల్లలు అతిగా మారాం చేయడం, కోపంగా అరవడం, కాళ్లు నేలకేసి కొట్టుకోవడం, తోటి పిల్లలపై దూకుడుగా ప్రవర్తించడం చేసినప్పుడు పట్టించుకోకుండానూ ఉండ కూడదు. వారికదే అలవాటుగా మారడమే కాదు, తమ ప్రవర్తన తప్పు కాదనే భావనకొస్తారు. అలాగే కోప్పడి, దండిస్తే మరింత మొండిగా మారే ప్రమాదమూ లేకపోలేదు. అలాకాకుండా వారిని సరిదిద్దడానికి ప్రయత్నించాలి. మెల్లగా తప్పొప్పులు చెప్పడానికి కృషి చేయాలి. ఆ ప్రవర్తన సరి కాదనే అవగాహన కలిగిస్తేనే వారిలో మార్పు వస్తుంది.  

ఇంట్లో.. నిత్యం సంతోషంగా ఉండే కుటుంబ వాతావరణంలో పెరిగే పిల్లలు శారీరక, మానసిక ఆరోగ్యాలతో ఉంటారని అధ్యయనాలు తేల్చాయి. అలాకాక తల్లిదండ్రుల మధ్య విభేదాలు, గొడవలు కూడా పిల్లల మానసిక వేదనకు కారణమవుతాయి. అమ్మానాన్నలు విడిపోయిన ఇంట్లో చిన్నారులు అభద్రత, ఆందోళనలకు గురవుతారు. ఇవన్నీ వారి మానసిక అనారోగ్యానికి దారితీస్తాయి. దీంతో పైకి కోపం ప్రదర్శించడం, ఎవరేం చెప్పినా వినని మొండి తనం, లోలోపల తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. తోటి వారితో కలవలేక పోవడం, చదువులో వెనకబడటం, దేనిపైనా ఆసక్తి చూపించక పోవడం వంటివన్నీ మొదలై, భవిష్యత్తును కోల్పోయే ప్రమాదమూ లేకపోలేదు.  

బయట.. రోజూ పిల్లలు అమిత కోపాన్ని ప్రదర్శిస్తూ అందరికీ దూరంగా ఉంటున్నారంటే వారికి తక్షణం తల్లిదండ్రుల సాయం అవసరమని అర్థం చేసుకోవాలి. ముందుగా కారణాన్ని గుర్తించాలి. ఇంటి వాతావరణం లేదా బయటివారి ప్రభావం వారి మనసును బాధిస్తుందేమో కనిపెట్టాలి. పిల్లల పట్ల స్నేహంగా, మృదువుగా ఉంటూ వారి మనసులోని మాటను చెప్పగలిగేలా చేయాలి. ఇంట్లోనే వారికి ఇబ్బంది ఎదురవుతూ ఉండొచ్చు. లేదా బంధువుల నుంచి ఏదైనా ఒత్తిడి ఏర్పడొచ్చు. ఇవన్నీ అడిగి తెలుసుకోవాలి. ఈ సమస్యలేవైనా ఉంటే, ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్