‘వద్దు’.. కచ్చితంగా!

జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో స్వేచ్ఛ తీసుకుంటున్న అమ్మాయిలెందరో. అది ప్రేమ అయినా.. అమ్మానాన్న ఎంపిక చేసిన వాళ్లని ముందుగానే పరిశీలించడమైనా. అయితే కలిసి నడవడం కుదరదు అనిపిస్తే మాత్రం కచ్చితంగా చెప్పేయమంటున్నారు నిపుణులు.

Updated : 08 Jul 2022 02:32 IST

జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో స్వేచ్ఛ తీసుకుంటున్న అమ్మాయిలెందరో. అది ప్రేమ అయినా.. అమ్మానాన్న ఎంపిక చేసిన వాళ్లని ముందుగానే పరిశీలించడమైనా. అయితే కలిసి నడవడం కుదరదు అనిపిస్తే మాత్రం కచ్చితంగా చెప్పేయమంటున్నారు నిపుణులు. ఆ విషయంలో కొన్ని సూచనలూ పాటించమంటున్నారు.

* స్పష్టంగా.. అభిప్రాయాలు, ఇష్టాలు, వ్యక్తిత్వం.. ఏదైనా నచ్చక కలిసి అడుగు వేయడం కుదరదనిపించిందా! నేరుగా చెప్పేయండి. ఫోన్‌ చేస్తే తీయకపోవడం, కనిపించకుండా తిరగడం లాంటివి చేయొద్దు. అవి అవతలి వాళ్లలో ఆశలు రేపే అవకాశముంది. అలాగని అవమానిస్తూనో, కోప్పడుతూనో చెప్పనవసరంలేదు. మర్యాదను పాటించండి.

* సుత్తి లేకుండా.. ‘నో’ చెప్పాలనుకున్నప్పుడు భారీ వివరణలొద్దు. వీలైనంత తక్కువ మాటల్లో ముగించేయండి. అవతలి వాళ్లని నిందిస్తూనో, వాళ్లే కారణమనిపించేలానో కూడా మాట్లాడొద్దు.

* సారీ చెప్పొద్దు.. నచ్చలేదని చెప్పడం తప్పు కాదు. మరలాంటప్పుడు సారీ ఎందుకు? ఇది మీరేదో తప్పు చేస్తున్నారన్న సూచనివ్వొచ్చు. అలాగే ‘నేను మీకు తగను’ లాంటి మాటలతో మిమ్మల్ని తక్కువ చేసుకోనూ వద్దు.

* ఆశ కల్పించొద్దు.. వద్దు అని చెప్పడం చాలామందికి కష్టం. దీంతో అబద్ధాలను ఆశ్రయిస్తుంటారు. కానీ ఇది అవతలి వ్యక్తికి ఆశలు కల్పించొచ్చు. కాబట్టి ధైర్యంగా చెప్పండి. తర్వాత ‘స్నేహితుల్లా ఉందాం’ లాంటివీ అనకండి. ఏ బంధానికైనా స్నేహమే ఆధారం. ఆ సఖ్యత కుదరకే కదా.. బంధంలోకి వెళ్లే ఆలోచనను మానుకుంది. అలాంటప్పుడు స్నేహితులయ్యే ఆస్కారమెక్కడిది? గొడవ పడక్కర్లేదు. అలాగని సాన్నిహిత్యాన్నీ ప్రదర్శించక్కర్లేదు.

* ఓపిక పట్టండి.. మీరు ఈ నిర్ణయం దాకా రావడానికి ఎంత ఆలోచించి ఉంటారు? చాలా సమయమే పట్టి ఉంటుంది. మీరు విషయం చెప్పగానే అవతలి వ్యక్తీ వెంటనే ‘సరే’ అనలేరు. కాబట్టి, దాన్ని జీర్ణించుకోడానికి వారికి కొంత సమయం ఇవ్వండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్