క్షమాపణ ఇలా కూడా చెప్పొచ్చు...

మనకిష్టమైన వ్యక్తిని క్షమించమని అడగడంతోపాటు నిన్ను నేను మరింత ప్రేమిస్తా అని చెప్పడం వారిని అన్నీ మర్చిపోయేలా చేస్తుందంటున్నారు నిపుణులు. మీ జీవిత భాగస్వామిని తెలిసో.. తెలియకో బాధ పెట్టినప్పుడు ఎలా నడుచుకోవాలో సూచిస్తున్నారు. హృదయపూర్వకంగా ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా భాగస్వామి మనసు కరగనప్పుడు మరో అడుగు ముందుకేయాలి.

Updated : 09 Jul 2022 08:37 IST

మనకిష్టమైన వ్యక్తిని క్షమించమని అడగడంతోపాటు నిన్ను నేను మరింత ప్రేమిస్తా అని చెప్పడం వారిని అన్నీ మర్చిపోయేలా చేస్తుందంటున్నారు నిపుణులు. మీ జీవిత భాగస్వామిని తెలిసో.. తెలియకో బాధ పెట్టినప్పుడు ఎలా నడుచుకోవాలో సూచిస్తున్నారు.

హృదయపూర్వకంగా ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా భాగస్వామి మనసు కరగనప్పుడు మరో అడుగు ముందుకేయాలి. మీ మనసులో వారి స్థానమెంతో భావోద్వేగంగా మీరు చెప్పగలగాలి. గొంతులో మార్దవం ఉట్టిపడాలి. మీరు చెప్పే పద్ధతిలో ఎదుటి వారికి నిజం కనిపించాలి. అప్పుడే కోపం దూదిపింజలా ఎగిరిపోతుంది. అలాకాకుండా ఒకటి రెండు సార్లు క్షమించమని అడిగి, అక్కడితో పని అయిపోయింది అనుకోవడం సరి కాదు. ఎన్నిసార్లు సారీ చెప్పాలి అని కసురుకోకూడదు. భాగస్వామి మనసు తిరిగి పూర్వ స్థితికి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే సున్నితంగా మాట్లాడి, వారిపై మీ ప్రేమను తెలియజేయడానికి ప్రయత్నిస్తే చాలు.

భరించాలి..

ప్రేమలో కోపాలు, క్షమాపణలు.. రెండూ ఉంటాయి. ప్రేమకు ఎలా ప్రత్యేక భాష ఉంటుందో, అవతలివారిని క్షమించమని అడగడానికి కూడా ప్రత్యేక భాష ఉందంటున్నారు నిపుణులు. వారు కోపంలో మీపట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని భరించాలి. తిరిగి వారిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. వారిలో నిరాశను బయటకు తీయగలగాలి. భాగస్వామికి మీపై కోపం లేదా బాధ ఎందుకు కలిగిందో చెబుతున్నప్పుడు పూర్తిగా వినాలి. మీ ముఖంలో పశ్చాత్తాపం కనిపించాలి. నాదే తప్పూ లేదు అనే భావన మీలో రాకుండా ఉంటేనే మీ క్షమాపణలు ఫలితాన్నిస్తాయి. సందర్భం సద్ద్దుమణిగిన తర్వాత జరిగిందేంటో కూడా మీ భాగస్వామి ఆలోచించడానికి ఆస్కారం ఉంది. అప్పుడు మీ గురించి చెప్పండి.

బాధ్యత..

మీరు నిజంగానే పొరపాటు చేసి ఉంటే దానిపై పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. దానివల్ల వచ్చే నష్టాన్ని భరించాలి. అన్నింటికన్నా ముందు మీ తప్పును మీరు ఒప్పుకోవాలి. మరోసారి ఇలా జరగనివ్వనని భరోసా ఇవ్వాలి. ఆ మాత్రానికే మీ స్థానం, గౌరవం తగ్గిపోవు. భార్యాభర్తల మధ్య వచ్చే ఇటువంటి చిన్నచిన్న సంఘటనలు పెద్దవి కాకుండా ముందుగానే జాగ్రత్తపడితే, ఆ వైవాహికబంధం మరింత బలపడుతుంది. కోపంలో మీ మాటలు వారిని ఎంతగా బాధపెట్టాయో మీరు గుర్తించారనే విషయం అర్థమైతే చాలు. మీ క్షమాపణలు మీ భాగస్వామిని ఎప్పటిలా సంతోషంగా మారుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్