అలవాటుకు బాధ్యత జత చేయాలి..

ఎదుటివారి నుంచి ఏ చిన్న సహాయాన్ని పొందినా కృతజ్ఞతలు చెప్పాలని అమ్మ నేర్పిన అలవాటును ఆరేళ్ల అక్షిత్‌ తప్పక పాటిస్తాడు. పిల్లలకు చిన్నప్పటి నుంచి రోజుకొక మంచి అలవాటుతోపాటు చిన్న బాధ్యతనూ జతచేసి నేర్పిస్తే, వారిని

Updated : 23 Jul 2022 09:37 IST

ఎదుటివారి నుంచి ఏ చిన్న సహాయాన్ని పొందినా కృతజ్ఞతలు చెప్పాలని అమ్మ నేర్పిన అలవాటును ఆరేళ్ల అక్షిత్‌ తప్పక పాటిస్తాడు. పిల్లలకు చిన్నప్పటి నుంచి రోజుకొక మంచి అలవాటుతోపాటు చిన్న బాధ్యతనూ జతచేసి నేర్పిస్తే, వారిని మంచి వ్యక్తిత్వం ఉన్న వారిగా తయారు చేస్తాయంటున్నారు నిపుణులు.

చిన్నారులకు ప్రత్యేకంగా పాఠంలా కాకుండా రోజువారీ అవసరాలతోపాటు కలిపి నేర్పే మంచి అలవాట్లు వారికి జీవితాంతం గుర్తుంటాయి. పాటించడం మొదలు పెడతారు. వారి పక్కను వారే సిద్ధం చేసుకోవడం అలవాటు చేస్తూ, వారానికికొకసారి పుస్తకాల అలమర శుభ్రపరుచుకోవాలని చెప్పాలి. నిద్రలేచిన వెంటనే దుప్పటి మడిచి సర్దడం వరకు మొదట్లో సాయం చేయాలి. ఇవి నేర్చుకోవడానికి మంచి కథ చెబుతానని, చిన్న కానుక ఇస్తానని అంటే చాలు. పిల్లలు క్రమేపీ ఆ రెండింటినీ వారే పూర్తిచేయడం నేర్చుకుంటారు. తమ పనులు తాము చేసుకోవడమే కాదు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం అలవరుచుకుంటారు. 

ప్రతి రోజు.. ఏ రోజు హోంవర్క్‌ ఆ రోజు పూర్తి చేయడంతోపాటు వారికి కానుకగా అందించే మొక్కను బాధ్యతగా పెంచడానికి ప్రయత్నించమని చెప్పాలి. త్వరగా వర్క్‌ పూర్తి చేస్తే, కలిసి సరదాగా తోటపని చేద్దామనాలి. పిల్లల్లో ఎక్కడలేని ఉత్సాహం మొదలవుతుంది. అలాగే వారికి నచ్చిన మొక్కను కానుకగా ఇవ్వాలి. దాని బాగోగులన్నీ వారికే అప్పజెప్పాలి. చదువుతోపాటు మొక్కల పెంపకాన్ని కూడా కలుపుకొని మరీ పిల్లలు ముందడుగు వేస్తారు. రెండింటినీ పాటిస్తారు. ఇవి వారికి జీవితంలో ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.

పెద్దవారికి.. పిల్లల ఆటబొమ్మల అలమరలన్నీ కనీసం వారానికొకసారి సర్దుకోవడం, ఆడుకోని బొమ్మలను తీసి పేద చిన్నారులకు ఇవ్వడానికి ప్యాక్‌ చేయడం నేర్పించాలి. ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలాంటి పెద్దవాళ్లకు తోడ్పడటం, వారి అవసరాలు చూసుకోవడం వంటి బాధ్యతలనప్పగించాలి. వారికి అవసరమైనప్పుడు మంచినీళ్లు అందించడం, సాయంకాలం వాకింగ్‌కు తీసుకెళ్లడం వంటివి నీ బాధ్యతలే అని చెప్పాలి. పెద్దవాళ్లతో కబుర్లు చెబుతూ అడుగులేసేలా చేయాలి. దీంతో తమ వద్ద ఉన్నవి ఇతరులకు పంచడం, పెద్దవాళ్లతో అనుబంధంగా ఉండటం ఎంత బాధ్యత అనేది అర్థమవుతుంది. ఇలా రెండింటినీ ఒకేసారి నేర్పిస్తే జీవితంలో ఇతరులను ప్రేమించడం అలవరచుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్