సాయపడతారా?

ఇతరులకు స్వచ్ఛందంగా మీరు అందించే సేవ మిమ్మల్ని నిత్యం ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. జీవితంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్పుతుంది అంటున్నారు నిపుణులు..సమయంతో పనిలేకుండా రోజంతా పరుగులు పెడుతున్న జీవనశైలిలో

Published : 27 Jul 2022 00:17 IST

ఇతరులకు స్వచ్ఛందంగా మీరు అందించే సేవ మిమ్మల్ని నిత్యం ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. జీవితంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్పుతుంది అంటున్నారు నిపుణులు..

మయంతో పనిలేకుండా రోజంతా పరుగులు పెడుతున్న జీవనశైలిలో వలంటీర్‌గా సేవలను అందించడంవల్ల ప్రయోజనాలెన్నో ఉన్నాయి. పేద పిల్లలకు మీ వంతు సాయం అందించినప్పుడు కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీలాగే ఆలోచించే దృక్పథం ఉన్నవారు పరిచయమవుతారు. వారితోపాటు కలిసి పని చేసినప్పుడు మనసు ఉల్లాసంగా మారుతుంది. అలాగే కష్టంలో ఉన్నవారికి మీరందించిన చేయూత తృప్తినిస్తుంది. వారి కళ్లల్లో కనిపించే ఆనందం మిమ్మల్ని మానసికంగా సంతోషంగా ఉంచుతుంది. అలా మనసుకు నచ్చిన పని చేసినప్పుడు ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివి దూరమవుతాయి.

నైపుణ్యాలు...

పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే ఇతరులకు సాయం చేయడం నేర్పిస్తే  వారిలో పలురకాల నైపుణ్యాలు పెంపొందుతాయి. బాల్యం నుంచి ఇతరులతో కలవడానికి ఇబ్బంది పడే మనస్తత్వం ఉన్నవారు వలంటీర్‌గా చేరితే మంచిది. అక్కడ ఎప్పటికప్పుడు కొత్తవారితో కలవడం, వారితో మాట్లాడటం, వారి అవసరాలను గుర్తించి చేయూతనివ్వడం వంటివన్నీ అలవడతాయి. ఒకేలా ఆలోచించే వారంతా ఒకచోట చేరినప్పుడు మరిన్ని కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఈ సేవ వేదికగా మారుతుంది. అంతేకాదు, ఎదుటివారిపై కోప్పడటం, లేదా మాట్లాడటానికి ఆసక్తి చూపించకపోవడం వంటి గుణాలన్నీ వలంటీర్‌గా చేరితే మారతాయి. అవతలి వ్యక్తి గురించి ఆలోచించడం, వారు చెప్పేది వినడానికి ఆసక్తి చూపించడం వంటి లక్షణాలన్నీ నేర్చుకోవడం సామాజికపరమైన నైపుణ్యాలను అందిస్తుంది. 

ఆత్మవిశ్వాసం..

పేద విద్యార్థులకు పాఠాలు చెప్పడం మొదలుపెడితే అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీకు తెలిసిన వాటిని అవతలివారికి అందిస్తున్నాననే మానసిక తృప్తి కలుగుతుంది. మీకంటూ ఓ గుర్తింపు వస్తుంది. మీలో ప్రతికూలంగా ఆలోచించే తీరు ఉంటే అది సానుకూలంగా మారుతుంది. ఎదుటివారి అవసరాన్ని గుర్తించడం తెలుస్తుంది. ఇవన్నీ శారీరక, మానసిక ఆనందాన్ని దరిచేరేలా చేస్తుంది. అంతేకాదు, వలంటీర్‌గా పనిచేస్తున్నప్పుడు సామాజిక, ఆర్థికపరంగా మీ స్థాయి తెలుసుకోవడం మొదలైతే, మీలో ఆత్మన్యూనత దూరమవుతుంది. ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూలో ఈ అనుభవాలను చెప్పగలిగితే చాలు. అర్హత పత్రాలతోపాటు మీ వ్యక్తిత్వంపై అవతలివారికి సదభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్