నో చెప్పండి..కానీ..!

ఉద్యోగం, వ్యాపారం చేసే మహిళల్లో కుటుంబానికి సరైన సమయం కేటాయించలేకపోతున్నామనే అపరాధ భావన ఉంటుంది. కానీ మనమిక్కడ అదనపు బాధ్యతల్ని నిర్వహిస్తున్నామని గుర్తుంచుకోవాలి. ఆ

Published : 23 Sep 2022 00:27 IST

ఉద్యోగం, వ్యాపారం చేసే మహిళల్లో కుటుంబానికి సరైన సమయం కేటాయించలేకపోతున్నామనే అపరాధ భావన ఉంటుంది. కానీ మనమిక్కడ అదనపు బాధ్యతల్ని నిర్వహిస్తున్నామని గుర్తుంచుకోవాలి. ఆ బాధలో కూరుకుపోక రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలో ఆలోచించుకోవాలి. ఎప్పుడూ ఒకే ప్రణాళికని అనుసరిస్తాననుకోవద్దు. దానిలో చిన్న తేడా వచ్చినా అప్పటిదాకా పడిన మీ శ్రమ వృథా అవుతుంది. ఎప్పటికప్పుడు మీ పని, ఇంట్లో వాళ్ల అవసరాలు బేరీజు వేసుకుంటూ ప్రణాళిక వేయండి. మీ తపన వాళ్లకీ అర్థమవుతుంది. నేను ఒంటరి తల్లిని. దీంతో రెట్టింపు బాధ్యతలు. చేయగలను అన్నప్పుడే మాట ఇస్తా. అది నిలబెట్టుకోవడానికి ఎంత శ్రమైనా పడతా. మీరూ ఈ పద్ధతిని ప్రయత్నించండి. చేయలేను అనుకున్నప్పుడు ‘నో’ చెప్పండి ఫర్లేదు.. కానీ చేస్తా అన్న తర్వాత వెనకడుగేయొద్దు. ఇంట్లో వాళ్లకి కేటాయించిన సమయంలోనూ ఫోన్‌, ఆఫీసు పనులు అంటూ పెట్టుకోవద్దు. ఆ సమయం పూర్తిగా వాళ్లకే కేటాయిస్తే.. మంచి జ్ఞాపకాలు తోడవుతాయి. అపరాధభావనా మీ దరిచేరదు.

- షౌనా చౌహాన్‌, సీఈఓ, పార్లే ఆగ్రో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్