కష్టం తెలిసేలా..

శశికళ నాలుగిళ్లల్లో పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివిస్తుంటే, వారిద్దరూ తల్లి కష్టాన్ని గుర్తించరు. సంపన్న కుటుంబానికి చెందిన రాధ తన కొడుకు కోరినవన్నీ అందించడంతో వాడు చిన్నతనంలోనే చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఏ స్థాయిలో ఉన్నా... పిల్లలను కష్టం తెలిసేలా పెంచాలంటున్నారు నిపుణులు.

Published : 04 Oct 2022 00:59 IST

శశికళ నాలుగిళ్లల్లో పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివిస్తుంటే, వారిద్దరూ తల్లి కష్టాన్ని గుర్తించరు. సంపన్న కుటుంబానికి చెందిన రాధ తన కొడుకు కోరినవన్నీ అందించడంతో వాడు చిన్నతనంలోనే చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఏ స్థాయిలో ఉన్నా... పిల్లలను కష్టం తెలిసేలా పెంచాలంటున్నారు నిపుణులు.

ప్రపంచంలో అత్యంత ధనికులుగా నిలిచిన నీతా అంబానీ, మెకంజీ వంటి వారెందరో పిల్లలకు రూపాయి విలువ తెలిసేలా పెంచాలని చెప్పడమే కాదు, వారికదే నేర్పారు. మధ్య, దిగువ తరగతి కుటుంబాల్లో తాము చదువుకోలేకపోయినా కనీసం పిల్లలనైనా విద్యా వంతులను చేయాలనుకుని కోరినవన్నీ అందిస్తారు. వాటి కోసం తామెంత శ్రమపడుతున్నామో తెలియనివ్వరు. దీంతో పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించరు. ఆ కష్టం విలువ తెలియకుండానే ఎదుగుతారు. అడిగిందల్లా అందిస్తుంటే అదే అలవాటుతో.. పెద్దైన తర్వాత కూడా ఇతరులపై ఆధారపడే స్థాయికి చేరుకొనే ప్రమాదం ఉంది. దీనివల్ల పలు ఇబ్బందులెదుర్కొంటారు. అందుకే బాల్యం నుంచే కష్టం తెలిసేలా పెంచితే భవిష్యత్తులో ఎటువంటి సందర్భాన్నైనా దాటగలుగుతారు.

అప్పగించాలి..

పిల్లలు తమకు బొమ్మలు, గేమ్స్‌ కావాలన్నప్పుడు వాటి కోసం వారికే పని చెప్పాలి. వారాంతంలో ఎంతో కొంత పాకెట్‌మనీ ఇస్తామని, పొదుపు చేయాల్సిన బాధ్యత వారిదేననాలి. మూడు డిబ్బీల్లో ఇచ్చిన నగదును 3 భాగాలుగా చేసి, పొదుపు, ఖర్చు, పంచడం ఇలా విడిగా వేయమనాలి. డిబ్బీలో ఉన్న నగదుతోనే వాళ్లు కోరినవి కొనివ్వాలి. పొదుపు దాంట్లో వేసిన వాటిని కంప్యూటర్‌, ల్యాప్‌ టాప్‌, సైకిల్‌ వంటి పెద్ద వస్తువుల కోసమని చెప్పాలి. షేరింగ్‌ దాంట్లోది ఆరు నెలలకొకసారి ఎవరైనా పేద విద్యార్థికి పుస్తకాలు వంటివి కొనివ్వడానికి ఉపయోగించడం నేర్పించాలి. దీని వల్ల ప్రతి రూపాయి వెనుక కష్టంతోపాటు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడమెలాగో తెలుసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్