సొంత థెరపీ అవసరం..

దాంపత్యంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకునేటప్పుడు దంపతులు థెరపీ ఇచ్చిపుచ్చుకోవడం కూడా మంచిదంటున్నారు నిపుణులు. సందర్భాన్నిబట్టి సున్నితంగా భాగస్వామిని సానుకూలంగా మార్చుకోవడమే ఆ థెరపీ.

Published : 09 Oct 2022 00:33 IST

దాంపత్యంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకునేటప్పుడు దంపతులు థెరపీ ఇచ్చిపుచ్చుకోవడం కూడా మంచిదంటున్నారు నిపుణులు. సందర్భాన్నిబట్టి సున్నితంగా భాగస్వామిని సానుకూలంగా మార్చుకోవడమే ఆ థెరపీ.

భార్యాభర్తల నడుమ మంచి అనుబంధం ఉన్నా కూడా కొన్ని అంశాలు సమస్యలొచ్చేలా చేస్తాయి. ఆర్థిక,  కుటుంబపరమైన అంశాలు కొన్నిసార్లు ఇరకాటంలో పెడతాయి. ఆ సందర్భాలు ఛాలెంజ్‌లాంటివే. ప్రశాంతంగా వాటిని దాటి బయటకు రావడానికి ఇద్దరిలో ఏ ఒక్కరైనా ప్రయత్నించగలిగితేనే ఆ సంసారం సవ్యంగా సాగుతుంది. ఎవరో ఒకరు ఎదుటి వారిపై థెరపీ ప్రయోగించాలి. మృదువుగా మాట్లాడటం, సమస్య నుంచి బయటకొచ్చి పరిష్కారాన్ని ఆలోచించడం అలవరచడమే ఆ థెరపీ. సమస్యను కొన్ని రోజులు మర్చిపోదామని చెప్పాలి. తర్వాత ఆలోచిస్తే సరైన పరిష్కారం దొరుకుతుందని వివరించాలి. అప్పటికి వారి మనసులో ఒత్తిడి దూరమై, సరైన రీతిలో ఆలోచించే స్థాయికి చేరుకుంటారు.

ఉద్యోగరీత్యా.. ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఇంటి పని, వంటపని, బయట పనులంటూ బాధ్యతలుంటాయి. వాటిని పంచుకోవాలి. కొన్ని సార్లు ఒకరికి ఉద్యోగ బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో పని అంతా మరొకరిపైన పడుతుంది. దాన్ని సమన్వయం చేయలేకపోతే సమస్యలు మొదలవుతాయి. చినికిచినికి గాలివాన అవుతాయి. వివాహమైన కొత్తలో బాధ్యతలు పంచుకొందామని చెప్పిన భాగస్వామి ఇప్పుడు తప్పించుకుంటున్నట్లుగా దంపతుల్లో ఏ ఒక్కరికి అనిపించినా అది పెద్ద సమస్య అవుతుంది. తనకున్న సమయాన్ని కేటాయించడానికి ముందుంటానని ఎదుటి వారికి నచ్చజెప్పాలి. ప్రాజెక్టు తర్వాత తిరిగి సమయం దొరుకుతుందని సున్నితంగా చెప్పాలి. చిన్న విషయాలకు ప్రాధాన్యమివ్వకుండా, పరిస్థితికి తగినట్లు అడుగులేస్తేనే బంధం బలపడుతుందని అవతలి వారికి అర్థమయ్యేలా చెప్పేదే థెరపీ.

ప్రతికూలత.. కొన్ని జంటల్లో ఎవరో ఒకరికి ప్రతి విషయాన్నీ ప్రతికూలంగా ఆలోచించే అలవాటుంటుంది. దీంతో సమస్యలు వస్తూంటాయి. ఏదైనా కొందామన్నా, ఏ పని ప్రారంభించాలన్నా ప్రతికూలంగా మాట్లాడతారు. అప్పుడు నిరుత్సాహపడితే ఆ సంసారం అభివృద్ధి దిశగా వెళ్లలేదు. అలాగని ఆ పని ప్రారంభించినా తనకు విలువ నివ్వలేదని ఎదుటివారు బాధపడే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండాలంటే నెమ్మదిగా వారికి థెరపీ ఇస్తూనే ఉండాలి. వారు చెప్పేది పూర్తిగా వింటూనే, సానుకూల ఆలోచనల దిశగా నడిపించాలి. అలా నడిచే వారెలా ఉన్నారో ఉదాహరణగా చూపించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్