Published : 12/10/2022 00:33 IST

పరిధులు గీయకండి....

డపిల్లల్ని చిన్న చూపు చూసే తీరు చిన్నప్పుడే మొదలవుతుంది. అదే క్రమంగా మహిళల్ని శక్తి హీనులుగానూ చిత్రీకరిస్తుంది. దాని ప్రభావంతోనే అంతా అమ్మాయిలకు పరిధులు గీస్తారు. అయితే, ఈ తరహా ఆలోచనా ధోరణులకు తల్లిదండ్రులే చెక్‌ పెట్టాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. అందుకు చిన్నప్పటి నుంచే వారికి ఆత్మరక్షణ విద్యలు నేర్పాలి. అప్పుడే ఆడపిల్లలు ఎటువంటి పోరాటానికైనా, ఆత్మరక్షణ చర్యలకైనా సిద్ధంగా ఉంటారు. సవాళ్లను అధిగమించి ఉన్నత స్థానాలనూ చేరుకోగలుగుతారు. అలానే, స్త్రీ తనని తాను నమ్మగలిగినప్పుడే తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోగలదు. అప్పుడే ఆమెని సమాజమూ ప్రోత్సహిస్తుంది.

- డా. సీమారావు. భారత సాయుధ దళాలకు మొట్టమొదటి మహిళా కమాండో శిక్షకురాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని