పండగల గురించి చెప్పాలి...

సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహనతో పాటు పండగలు, వాటినెలా, ఎందుకు చేసుకుంటామనే అంశాలనూ పిల్లలకు వివరించాలంటున్నారు నిపుణులు.

Updated : 19 Oct 2022 05:19 IST

సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహనతో పాటు పండగలు, వాటినెలా, ఎందుకు చేసుకుంటామనే అంశాలనూ పిల్లలకు వివరించాలంటున్నారు నిపుణులు. అప్పుడే వారిలో ఆసక్తి పెరిగి, తర్వాతి తరాలకీ వాటిని అందించగలుగుతారు.

పండగ వాతావరణం గతంలో పిల్లలనెంతో ఆకర్షించేది. కొత్త దుస్తులు, పిండివంటలు, అతిథులంటూ ఇల్లంతా నెలకొనే సందడి వారికి మరింత ఉత్సాహాన్ని పెంచేది. ఇప్పటి డిజిటల్‌ తరానికి సాంకేతికత ఒక్కటే ముఖ్యంగా కనిపిస్తోంది. దీంతో పండగల ప్రాశస్త్యంపై అవగాహన ఉండటం లేదు. తరతరాల సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండగలను పిల్లలకు వివరంగా తెలియజేస్తే.. వాటివల్ల విజ్ఞానం, ఉత్సాహం కలుగుతాయి. ఇది వారిలో ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది. అందరూ కలిసి చేసుకొనే పండగలు చిన్నారులకు జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా మిగులుతాయి. వాటిని వారి పిల్లలకూ వివరిస్తూ, ఆ సంతోషాన్ని వాళ్లకూ అందిస్తారు.

సంప్రదాయంతోపాటు..
పండగకి వెనుక ఉన్న పురాణ కథలను పిల్లలకు చెప్పాలి. ఆయా సీజన్లలో ఏది ఎందుకొస్తుందో, దానివల్ల మానసికంగానే కాకుండా, ఆరోగ్యపరంగా ప్రయోజనాలెన్ని ఉన్నాయో వివరించాలి. ప్రతి పండగ పరమార్థాన్నీ వివరించాలి. వాటిని గౌరవించేలా, విశ్వసించేలా పెంచాలి.

సృజనాత్మకంగా..
ప్రతి పండగకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. దాన్ని చేసుకోవడంలో సృజనాత్మకతను పిల్లలకు నేర్పాలి. దుస్తుల ఎంపిక నుంచి ఇంటి అలంకరణ సహా అన్నింట్లోనూ వారిని పిల్లలను భాగస్వాములను చేయాలి. అప్పుడే వారిలో మానసిక ఉల్లాసం కలుగుతుంది. నలుగురితో కలవడమూ నేర్చుకుంటారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో కలిసి సరదాగా గడుపుతారు. పెద్దవాళ్లతో ఎలా మెలగాలో తెలుసుకుంటారు. మరో పండగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేంత ఆసక్తి పిల్లల్లో మొదలవుతుంది. ఇవన్నీ వారిలో చదువుతో వచ్చే ఒత్తిడిని మటుమాయం చేస్తాయి. పండగ అంటే సంతోషాన్ని మోసుకొచ్చే సందర్భం అని అర్థం చేసుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్