వారికి మంచి స్నేహితులవ్వండి

తల్లిదండ్రులు పిల్లలకు మంచి స్నేహితుల్లా ఉండాలనీ అందరూ చెప్పేదే! కాకపోతే అదంత సులభం కాదు. ముఖ్యంగా పిల్లలు ఎదిగే కొద్దీ అమ్మానాన్నలుగా మీరు పట్టు బిగించాలని చూస్తారు. వారు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. అప్పుడే సమస్యలు... అలా జరక్కూడదంటే..

Published : 20 Oct 2022 00:17 IST

తల్లిదండ్రులు పిల్లలకు మంచి స్నేహితుల్లా ఉండాలనీ అందరూ చెప్పేదే! కాకపోతే అదంత సులభం కాదు. ముఖ్యంగా పిల్లలు ఎదిగే కొద్దీ అమ్మానాన్నలుగా మీరు పట్టు బిగించాలని చూస్తారు. వారు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. అప్పుడే సమస్యలు... అలా జరక్కూడదంటే..

* పిల్లలు పొరబాట్లు చేసినపుడు దండన మాత్రమే పరిష్కారం కాదు. తరచూ వారిని నియంత్రించాలని చూస్తుంటే మరింత మొండిగా వ్యవహరించే అవకాశం ఉంది. అందుకే, వారి ప్రవర్తన వల్ల నష్టమేంటో చెప్పి ఊరుకోండి. నష్టమేర్పడితే కూడా...దాని ఫలితాన్ని వారే అనుభవించేలా చేయండి. అయితే అలాంటప్పుడు దెప్పి పొడవద్దు. సౌమ్యంగానే వివరించండి. ఈసారి కచ్చితంగా మీ మాట వింటారు.

* పిల్లల్ని ఓ కంట గమనించడం మంచిదే కానీ.. అనుమానంతో చూడ్డం, పదేపదే ప్రశ్నించడం తగదు. ముఖ్యంగా వాళ్ల స్నేహితుల్ని మీ మిత్రుల్లాగే చూడండి. వారి ముందు వాళ్ల గురించి అసలు ప్రతికూలంగా మాట్లాడకండి.

* మీ విలువలు, ఆదర్శాలూ గొప్పవే కావొచ్చు. కానీ అవి పాటిస్తేనే నిన్ను ప్రేమిస్తాను అనే ధోరణి వద్దు. మీ ప్రేమ బేషరతుగానే ఉంటుందని చెప్పండి. ఏదైనా పొరబాటు చేస్తే మీ కోపం దాని పైనే తప్ప.. వాళ్లపై కాదని వివరించండి.

* సలహాలూ సూచనలు ఎవరెన్ని ఇచ్చినా.. పిల్లలతో మీరు ఎక్కువ సమయం గడపగలిగితేనే వాటిన్నింటినీ పాటించగలరు! పిల్లల పెంపకానికి అదే ప్రాణాధారం. రోజులో కనీసం గంటైనా వాళ్లకోసం కేటాయించండి. వాళ్లు చెప్పింది శ్రద్ధగా వినండి. మీరు వాళ్లకి స్నేహితులు కావడానికి అదే తొలి మెట్టు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్