ఆ రెండూ.. వద్దు

భర్త ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లేదా సహోద్యోగినుల గురించి చెబుతున్నప్పుడు అసూయపడుతూ.. దాన్ని అనుమానంగా మార్చుకోకూడదు. భాగస్వామికి అనుమానం కలిగించేలా భర్త ప్రవర్తనా ఉండ కూడదు. ఉద్యోగినిగా, ఇల్లాలిగా పలు బాధ్యతలు వహిస్తున్న భార్యను చూసి భర్త అసూయ పడకూడదు.

Published : 22 Oct 2022 01:01 IST

దంపతుల్లో ఒకరిపై మరొకరికి అసూయ, అనుమానం ఉన్నాయంటే ఆ సంసారం సమస్యలమయం అంటున్నారు నిపుణులు. బంధాలను బలహీనం చేసే ఈ రెండింటికి దూరంగా ఉంటే, భార్యాభర్తల అనురాగం కలకాలం దృఢంగా ఉంటుంది అని చెబుతున్నారు.

ర్త ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లేదా సహోద్యోగినుల గురించి చెబుతున్నప్పుడు అసూయపడుతూ.. దాన్ని అనుమానంగా మార్చుకోకూడదు. భాగస్వామికి అనుమానం కలిగించేలా భర్త ప్రవర్తనా ఉండ కూడదు. ఉద్యోగినిగా, ఇల్లాలిగా పలు బాధ్యతలు వహిస్తున్న భార్యను చూసి భర్త అసూయ పడకూడదు. పని ఒత్తిడి కారణంగా తనకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్న సతీమణిని భర్త అనుమానించకూడదు. పరిస్థితిని అర్థం చేసుకుని, తనకు చేయూతనందించడానికి సిద్ధంగా ఉండాలి. ఇదంతా జరగాలంటే పరస్పరం భరోసా ఉండాలి. నమ్మకమే బంధానికి అసలైన పునాది అని భార్యాభర్తలకు తెలిస్తే చాలు. ఏ సమస్యకూ తావుండదు. అలా కాక  ప్రతి అడుగునూ అనుమానంగా చూడటం, ఫోన్‌ కాల్స్‌ను పరిశీలించడం, మాటలు, చేతలతో నిత్యం బాధించడం వంటివి చేస్తే, అవతలి వారిపై అవన్నీ తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. భాగస్వామి తననెందుకు నమ్మడం లేదనే వేదన వారిని కుంగ దీస్తుంది. క్రమేపీ ఇరువురి మధ్య బంధం బీటలు వారుతుంది.

సమయం.. వైవాహికబంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇరువురూ తమ గురించి ఎదుటి వారికి చెప్పాలి. తమ వ్యక్తిత్వం, అభిరుచులను భాగస్వామితో పంచుకోవాలి. ఒకరికోసం మరొకరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే, దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ చోటుచేసుకోవు. బయట ఎవరితో మాట్లాడినా తనను దూరంగా ఉంచారనే అనుమానం భార్యాభర్తల్లో ఏ ఒక్కరినీ దరిచేరదు. తమ కోసమే అవతలి వ్యక్తి అనే భరోసా ఎదుటివారికి ఉండాలి. అలా లేదని తెలిసినప్పుడు వారెందుకు అలా ఆలోచిస్తున్నారో అనునయంగా మాట్లాడి తెలుసుకోవాలి. తన సందేహాలను తీర్చగలగాలి. వారికి నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తే, వారి మనసు తేలిక పడుతుంది. సమస్యను పరిష్కరించమంటూ మూడోవ్యక్తిని సంప్రదించకుండా ఉంటే మంచిది. దంపతుల సమస్యను వారిద్దరే కూర్చుని మాట్లాడుకోవాలి. అప్పుడు చాలా సమస్యలను బయటి వారితో సంబంధం లేకుండా పరిష్కరించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్