పిల్లలకి ఇవి నేర్పుతున్నారా?

చిన్నప్పుడే పిల్లలకు చక్కటి అభిరుచుల్ని అలవాటు చేయగలిగితే... కొత్త విషయాలను నేర్చుకోగలగడమే కాదు క్రమశిక్షణా అలవడుతుంది. అల్లరీ అదుపులో ఉంటుంది.

Published : 08 Nov 2022 00:49 IST

చిన్నప్పుడే పిల్లలకు చక్కటి అభిరుచుల్ని అలవాటు చేయగలిగితే... కొత్త విషయాలను నేర్చుకోగలగడమే కాదు క్రమశిక్షణా అలవడుతుంది. అల్లరీ అదుపులో ఉంటుంది. అయితే వారికి చక్కటి అభిరుచుల్ని అలవాటు చేయాలంటే... అమ్మానాన్నలు కాస్త శ్రద్ధ చూపాలి. సమయం కేటాయించాలి.

* ఈ రోజుల్లో తీరికలేని జీవనశైలితో గడిపేసే వారు చాలామందే. ఏదో కాస్త వండి పెట్టడం, స్కూలుకి పంపడం తప్ప... వారి చదువులపై, అభిరుచులపై శ్రద్ధపెట్టి గమనించే తీరిక చాలామంది తల్లిదండ్రులకు ఉండటం లేదు. ఆటలూ, ఇతర ఆసక్తులపై గడిపే సమయం లేక పిల్లలు ఒత్తిడికి గురవుతుంటారు. అందుకే రోజూ కాకపోయినా వారాంతంలో అయినా వారి హాబీల కోసం కొంత సమయం కేటాయించండి. పెయింటింగ్‌, డ్యాన్స్‌, ఈత... ఇలా వారికి నచ్చిన తరగతిలో చేర్చండి. కాస్త తేలికపడతారు. అయితే ఇవి ఆటవిడుపుగా నేర్చుకునేలా ఉండాలి.

* ఒక్కొక్కరికీ ఒక్కో అంశం తెలుసు కోవడంలో ఆనందం ఉంటుంది. మరి మీ పిల్లలకు వేటిలో ఆసక్తి ఉందో తెలుసుకుని ప్రోత్సహించండి. ఉదాహరణకు మీ పాప చక్కగా పాడగలిగితే... మ్యూజిక్‌ నేర్పించండి. రకరకాల బొమ్మలు తయారు చేస్తుంటే... క్రాఫ్ట్స్‌ తరగతిలో చేర్చండి. వారి ఆసక్తికి సాన పెట్టుకుంటారు. ఒత్తిడికీ దూరంగా ఉంటారు. మీరూ కాస్త కుదుట పడొచ్చు.

* కొందరు చిన్నారులకు కచ్చితమైన అభిరుచి అంటూ ఉండదు. అలాగని వారిని అలానే వదిలేయకండి. వారికి ఆ అభి రుచుల్ని మీరే అలవాటు చేయండి. మీరు ఇష్టంగా చేసే పనులు వారితో పంచుకోండి. వారికీ ఆసక్తి కలగొచ్చు. మొక్కల పెంపకం, పెయింటింగ్‌, క్రీడలూ ఇలా ఎందులో ఎక్కువ సమయం సరదాగా గడప గలుగుతున్నారో గమనించండి. ఆ విషయంలో మరింత శ్రద్ధ పెట్టండి. దానిలో చక్కగా రాణించగలుగుతారు. అల్లరీ అదుపులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్