పిల్లలకూ కావాలి వ్యాయామం!

ఈ రోజుల్లో పిల్లలు జంక్‌ఫుడ్‌ తీసుకోవడం ఎక్కువైంది. శారీరక శ్రమ తక్కువైంది. ఫలితంగానే ఊబకాయం. ఇది ఆత్మ న్యూనతతో పాటు అనారోగ్య సమస్యలకూ మూలం కావొచ్చు. అందుకే క్రమం తప్పక వ్యాయామం చేయాలంటున్నారు నిపుణులు.

Updated : 09 Nov 2022 04:30 IST

ఈ రోజుల్లో పిల్లలు జంక్‌ఫుడ్‌ తీసుకోవడం ఎక్కువైంది. శారీరక శ్రమ తక్కువైంది. ఫలితంగానే ఊబకాయం. ఇది ఆత్మన్యూనతతో పాటు అనారోగ్య సమస్యలకూ మూలం కావొచ్చు. అందుకే క్రమం తప్పక వ్యాయామం చేయాలంటున్నారు నిపుణులు.

* తీసుకున్న ఆహారానికి తగ్గ శ్రమ శరీరానికి ఉండాలి. అందుకే పిల్లల్ని రోజూ ఓ గంట కచ్చితంగా ఆడుకోనివ్వండి. ఉదయమో సాయంత్రమో ఓ గంట ఈత, తాడాట, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, దాగుడు మూతలు ఇలా ఒకటేమిటి ఒళ్లు అలిసేలా ఏది ఎంచుకున్నా అది చక్కని వ్యాయామమే.

* వ్యాయామం అనగానే బరువులెత్తడమో, పరుగులు తీయడమో మాత్రమే కాదు. పిల్లలు ఎక్కువ సేపు కూర్చునే ఉండకుండా చూడండి. చిన్నారులు కాసేపు ఆడుకుంటాము అనగానే కొందరు వారి వెనకాలే పడుతూ... పడిపోతావు, ఎగరకూ, దూకకూ అని ఆంక్షలు పెడుతుంటారు. అలా చేయొద్దు. వారిని స్వేచ్ఛగా చెమటలు పట్టే వరకూ ఆడనివ్వండి. అలానే రోజూ స్కూలు నుంచి వచ్చాక ఓ అరగంట సైకిల్‌ తొక్కమనండి. తాడాట ఆడించండి. ఇవన్నీ ఒత్తిడినీ తగ్గిస్తాయి. శరీరానికి వ్యాయామాన్ని అందిస్తాయి.

* పెద్దలకే కాదు... పిల్లలకోసమూ ఇప్పుడు జిమ్‌లు వచ్చేశాయి. ఆసక్తి ఉంటే వాటిలో చేర్చొచ్చు. అలాకాక ఇంట్లోనే కసరత్తులు చేయిస్తాం అంటారా? వారి కోసం ఇండోర్‌ జిమ్‌ సెట్స్‌ వచ్చాయి. జిమ్నాస్టిక్‌ రింగ్‌, క్లైంబ్‌ లేడర్‌ వంటివెన్నో ఇందులో ఉన్నాయి. వాటితో సరదాగానే శారీరక శ్రమ చేయించొచ్చు. సులువుగా బరువు తగ్గుతారు. అయితే, వీటితో పాటు... ఆహార ప్రణాళిక కూడా పక్కాగా ఉండేలా చూసుకోండి. సమతులాహారం అందించాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్