ఆకర్షణకు ఒత్తిడే శత్రువు..

నిషిత, కౌశిక్‌ శారీరకంగా కలిసి.. సంతోషంగా ఉండి నెలలు దాటింది. ఒకే ఇంట్లో ఉంటూ..  ప్రేమగానే ఉన్నట్లున్నా.. నెలల తరబడి వారి మధ్య ఎటువంటి ఆనంద క్షణాలూ లేవు. ఇక రాశి విషయంలో భర్త యాంత్రికత ఆమెను బాధిస్తోంది. దంపతుల మధ్య కలకాలం ఉండాల్సిన శారీరక, మానసిక ఆకర్షణకు ఒత్తిడి శత్రువుగా మారుతోందంటున్నారు నిపుణులు.

Published : 11 Nov 2022 00:09 IST

నిషిత, కౌశిక్‌ శారీరకంగా కలిసి.. సంతోషంగా ఉండి నెలలు దాటింది. ఒకే ఇంట్లో ఉంటూ..  ప్రేమగానే ఉన్నట్లున్నా.. నెలల తరబడి వారి మధ్య ఎటువంటి ఆనంద క్షణాలూ లేవు. ఇక రాశి విషయంలో భర్త యాంత్రికత ఆమెను బాధిస్తోంది. దంపతుల మధ్య కలకాలం ఉండాల్సిన శారీరక, మానసిక ఆకర్షణకు ఒత్తిడి శత్రువుగా మారుతోందంటున్నారు నిపుణులు. ఇదిలాగే కొనసాగితే వైవాహిక బంధం బీటలువారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

వివాహమైన కొత్తలో భార్యా భర్తల మధ్య ఆకర్షణ ఉండటం సహజం. బంధం పాతబడుతున్నకొద్దీ ఒకరంటే మరొకరికి ఆకర్షణ కొంత తగ్గినా, ప్రేమ పెరగాలి. అదే వారిని ఒక్కటిగా ఉంచుతుంది. ఈ బంధాన్ని ఇరువురూ కాపాడుకోవాలి. భాగస్వామికి ప్రేమను పంచుతూ, వారి అభిరుచులను తెలుసుకొని గౌరవించాలి. వైవాహిక బంధాన్ని నిత్యనూతనంగా ఉంచుకోవడానికి పరస్పరం ప్రేమను అందించుకోవాలి. అప్పుడే దంపతుల మధ్య ఆకర్షణ కొరవడకుండా ఉంటుంది.

యాంత్రికత..

సంతోషంగా ఎందుకు ఉండలేక పోతున్నామనే ఆలోచన ఇరువురికీ ఉండాలి. దీనిపై చర్చించుకొని కారణాల్ని గుర్తించాలి. కెరియర్‌, ఉద్యోగం, కుటుంబ ప్రభావమే ఒత్తిడికి దారితీస్తున్నట్లు తెలిస్తే వాటిని ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవాలి. బయటకు వెళ్లడం, స్నేహితులను కలవడం, ఇష్టమైన ప్రాంతాలను చుట్టి రావడం, కబుర్లు చెప్పుకోవడం వంటి వాటితో యాంత్రికత దూరమవుతుంది. శారీరక, మానసికారోగ్యం కోసం కంటి నిండా నిద్ర, వ్యాయామాలు, పోషకాహారం తీసుకోవాలి.  

కష్టసమయాల్లో..

భార్యాభర్తల మధ్య ఆకర్షణ, ప్రేమ ఉంటేనే కుటుంబ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయొచ్చు. కష్ట సమయాల్లో ఇరువురూ ఒకరికొకరు తోడుగా నిలిచి వాటిని దాటొచ్చు. దంపతుల మధ్య ప్రేమ ఆ ఇద్దరి జీవితాల్లోనూ ప్రతిఫలిస్తుంది. అడుగుపెట్టే ప్రతిదాంట్లోనూ విజయాలు సాధించగలుగుతారు. అవతలివారిలో ఏదైనా నచ్చని అంశం ఉంటే సున్నితంగా, అనునయంగా చెప్పాలి. ఏ ఇద్దరూ ఒకే ఆలోచనలు, అలవాట్లతో ఉండరు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎదుటి వారిని గౌరవిస్తే చాలు. వారు మరింత ప్రేమను పంచుతారు. నిజమైనది.. శాశ్వతమైనది వైవాహిక బంధమని అర్థం చేసుకుంటే, ఆ దాంపత్యం కలకాలం సంతోషంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్